SBI Services | దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త అందించింది. కస్టమర్ల కోసం కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల సీనియర్ సిటిజన్స్‌కు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎస్బీఐ సీనియర్ సిటిజన్స్ కస్టమర్లు ఇకపై వాట్సాప్‌లోనే పెన్షన్ (Pension) స్లిప్ పొందొచ్చు. ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది.
‘ఇక మీ పెన్షన్ స్లిప్‌ను వాట్సాప్ ద్వారా పొందండి అంతరాయం లేకుండా సులభంగాంనే సర్వీసులు పొందొచ్చు. హాయ్ అని మెసేజ్‌ను 9022690226కు వాట్సాప్ చేయండి’ అంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. అందువల్ల సీనియర్ సిటిజన్స్‌కు ఈ సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందొచ్చు.
రోజుకు రూ.10 ఇచ్చి బంగారం కొనండిలా!
మీరు ఎస్బీఐ వాట్సాప్ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ పెట్టగానే మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, పెన్షన్ స్లిప్ అనేవి ఇవి. ఇందులో మీరు పెన్షన్ స్లిప్పై క్లిక్ చేయాలి. తర్వాత నెల ఎంచుకోవాలి. ఏ నెల పెన్షన్ స్లిప్ కావాలని కోరుకుంటున్నారో ఆ నెల ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీరు మీకు ప్లీజ్ వెయిట్ అనే మెసేజ్ కనిపిస్తుంది. తర్వాత మీ పెన్షన్ స్లిప్ వివరాలు పొందొచ్చు.
డెబిట్ కార్డు వాడే వారికి గుడ్ న్యూస్.. రూ.5 లక్షల వరకు లిమిట్ పెంపు!
Now get your pension slip over WhatsApp! Avail hassle-free service at your comfort. Send a "Hi" on +91 9022690226 over WhatsApp to avail the service. #SBI #AmritMahotsav #WhatsAppBanking #PensionSlip pic.twitter.com/rGgXMTup32
— State Bank of India (@TheOfficialSBI) November 17, 2022
సీనియర్ సిటిజన్స్ ఎక్కడైనా, ఎక్కడైనా ఈ సర్వీసుల పొందొచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎస్బీఐ తీసుకువచ్చిన ఈ కొత్త సేవల వల్ల సీనియర్ సిటిజన్స్‌కు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఎస్బీఐ అకౌంట్ కలిగిన వారు నామినీ పేరు రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమం. దీనికి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఎస్బీఐ ఆన్లైన్ ద్వారా ఈ పని పూర్తి చేయొచ్చు. దీని కోసం నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వాలి. రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీస్లోకి వెళ్లాలి. తర్వాత ఆన్లైన్ నామినేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. అటుపైన నామిని వివరాలు ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లేదంటే ఎస్బీఐ యోనో ద్వారా కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. సర్వీసెస్ అండ్ రిక్వెస్ట్‌లోకి వెళ్లాలి. అక్కడ అకౌంట్ నామినీ ఎంచుకోవాలి. అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నామినీ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Pensions, Sbi, Senior citizens, State bank of india