హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Safety Tips: లోన్ యాప్స్‌తో జాగ్రత్త... ఈ 6 టిప్స్ పాటించమంటున్న ఎస్‌బీఐ

SBI Safety Tips: లోన్ యాప్స్‌తో జాగ్రత్త... ఈ 6 టిప్స్ పాటించమంటున్న ఎస్‌బీఐ

SBI Safety Tips: లోన్ యాప్స్‌తో జాగ్రత్త... ఈ 6 టిప్స్ పాటించమంటున్న ఎస్‌బీఐ
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Safety Tips: లోన్ యాప్స్‌తో జాగ్రత్త... ఈ 6 టిప్స్ పాటించమంటున్న ఎస్‌బీఐ (ప్రతీకాత్మక చిత్రం)

SBI Safety Tips | లోన్ యాప్స్‌తో జాగ్రత్త ఉండాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకు కస్టమర్లను హెచ్చరిస్తుంది. ట్విట్టర్‌లో 6 టిప్స్ షేర్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కొంతకాలంగా లోన్ యాప్స్ (Loan Apps) కేంద్రంగా అనే మోసాలు, దారుణాలు జరుగుతున్నాయి. లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకొని రెండు మూడు రెట్లు అప్పులు చెల్లించినవారు ఉన్నారు. అప్పు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డవారున్నారు. ఇప్పటికీ లోన్ యాప్స్ నిర్వాహకుల అరాచకాలు బయటపడుతున్నాయి. పోలీసుల దగ్గర్నుంచి బ్యాంకుల వరకు అందరూ లోన్ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకు కస్టమర్లను హెచ్చరిస్తోంది. లోన్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల పేర్లతో వచ్చే అనుమానాస్పద లింక్స్‌ని క్లిక్ చేయకూడదని, మీ సమాచారాన్ని ఎవరితో షేర్ చేయకూడదని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. ఇలాంటివి వస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరుతోంది. అంతేకాదు, లోన్ యాప్స్ విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలో సూచిస్తూ 6 టిప్స్ షేర్ చేసింది ఎస్‌బీఐ. ఆ 6 టిప్స్ ఇవే.

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు ఒక్క ఫోన్ కాల్‌తో 30 పైగా బ్యాంకింగ్ సేవలు

1. ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు ఆ యాప్ విశ్వసనీయతను చెక్ చేయాలి.

2. అనుమానాస్పద లింక్స్‌ని క్లిక్ చేయకూడదు.

3. అనధికార యాప్స్‌ని ఉపయోగించకూడదు. ఈ యాప్స్ మీ డేటా దొంగిలించే అవకాశముంది.

4. మీ డేటా దొంగిలించకుండా యాప్ పర్మిషన్ సెట్టింగ్స్ పరిశీలించాలి.

5. అనుమానాస్పద మనీ లెండింగ్ యాప్స్ గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

6. మీ ఆర్థిక అవసరాల కోసం http://bank.sbi వెబ్‌సైట్‌ సందర్శించాలి.

Jio 5G: జియో 5జీ నెట్వర్క్ వాడుకోవడానికి స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ మార్చండిలా

ఎస్‌బీఐ సూచిస్తున్న ఈ టిప్స్ పాటించడం ద్వారా మీ డేటా కాపాడుకోవడంతో పాటు, మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడొచ్చు. మీరు రుణాలు తీసుకోవాలనుకుంటే ఆర్‌బీఐ గుర్తించిన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలనే ఆశ్రయించాలి. గుర్తుతెలియని వ్యక్తులు, అనధికార యాప్స్‌లో మీ ముఖ్యమైన డాక్యుమెంట్స్ షేర్ చేయకూడదు.

ఫేక్ యాప్స్ విషయంలో జాగ్రత్త

బ్యాంకింగ్ యాప్స్, లోన్ యాప్స్ మాత్రమే కాదు, ఇతర ఏ యాప్స్ డౌన్‌లోడ్ చేయాలన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారిక యాప్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేయాలి. అధికారిక యాప్ స్టోర్ నుంచి మాత్రమే యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. థర్డ్ పార్టీ యాప్స్, ఏపీకే ఫైల్స్ అస్సలు ఇన్‌స్టాల్ చేయకూడదు. యాప్ ఇన్‌స్టాల్ చేసేముందు డెవలపర్ పేరు చెక్ చేయాలి. ప్లేస్టోర్‌లో ఒకే యాప్ లాగా అనేక యాప్స్ కనిపిస్తాయి. అందుకే ఒరిజినల్ యాప్ ఏదో గుర్తించడం తప్పనిసరి. కొత్తగా ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఓసారి రివ్యూస్ చదవాలి. నెగిటీవ్ రివ్యూస్ పైన దృష్టిపెట్టాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: CYBER CRIME, Cyber safety, Personal Finance, Sbi, State bank of india