SBI: ఏటీఎం కార్డుల్ని తొలగించే ఆలోచనలో ఎస్బీఐ... డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసా?
SBI Yono Cash | యోనో ప్లాట్‌ఫామ్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఎస్బీఐ ఏటీఎం సెంటర్లే యోనో క్యాష్ పాయింట్స్‌గా పనిచేస్తాయి. ఇప్పటికే 68,000 యోనో క్యాష్ పాయింట్స్‌ని ఏర్పాటు చేసింది ఎస్బీఐ.
news18-telugu
Updated: August 20, 2019, 10:29 AM IST

SBI: ఏటీఎం కార్డుల్ని తొలగించే ఆలోచనలో ఎస్బీఐ... డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: August 20, 2019, 10:29 AM IST
డబ్బులు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డ్ కావాల్సిందే. కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఏటీఎం కార్డ్ లేకపోయినా డబ్బులు డ్రా చేయొచ్చు. కొద్దిరోజుల క్రితమే యోనో క్యాష్ పేరుతో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. అయితే యోనో క్యాష్ గురించి అవగాహన ఉన్నవారు తక్కువే. యోనో క్యాష్ గురించి తెలిసినవారు కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. యోనో క్యాష్‌పై అందరికీ అవగాహన పెరిగితే ఇక ఏటీఎం కార్డుల అవసరమే ఉండదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే కోరుకుంటోంది. డిజిటల్ పేమెంట్స్‌ని ప్రోత్సహించి ఏటీఎం కార్డుల్ని పూర్తిగా తొలగించాలని ఎస్బీఐ భావిస్తోంది.
భారతదేశంలో మొత్తం 90 కోట్ల డెబిట్ కార్డులు ఉండగా 3 కోట్ల క్రెడిట్ కార్డులున్నాయి. డెబిట్ కార్డ్ లేని దేశంగా మార్చేందుకు యోనో ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది. క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్స్ చేయడం కూడా సులభమే. డెబిట్ కార్డుల్ని తొలగించాలన్నది మా ఆలోచన. తప్పకుండా కార్డుల్ని తొలగిస్తాం. వచ్చే ఐదేళ్లలో జేబులో ప్లాస్టిక్ కార్డుల సంఖ్య తగ్గిపోతుంది.
ATM: కార్డు మర్చిపోయారా? అయినా డబ్బులు డ్రా చేసుకోవచ్చు ఇలా
యోనో ప్లాట్‌ఫామ్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఎస్బీఐ ఏటీఎం సెంటర్లే యోనో క్యాష్ పాయింట్స్‌గా పనిచేస్తాయి. ఇప్పటికే 68,000 యోనో క్యాష్ పాయింట్స్‌ని ఏర్పాటు చేసింది ఎస్బీఐ. మరో 18 నెలల్లో 10 లక్షల యోనో క్యాష్ పాయింట్స్ ఏర్పాటు చేసే దిశగా పనులు జరుగుతున్నాయి. కస్టమర్ స్మార్ట్‌ఫోన్‌లో యోనో యాప్ ఉంటే చాలు. యోనో క్యాష్ ఆప్షన్‌తో డెబిట్ కార్డ్ అవసరం లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చు. డబ్బులు డ్రా చేయడం మాత్రమే కాదు... షాపింగ్ సమయంలో పేమెంట్స్ చేయడం కూడా సులువే. కాబట్టి ఇక కార్డుల అవసరమే ఉండదు. కార్డు లేకపోయినా డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇవ్వొచ్చు తెలుసా
Paytm: మీ ఫోన్లో పేటీఎం యాప్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న కంపెనీ
Railways: ట్రైన్ టికెట్‌పై 100% వరకు కన్సెషన్... ఎవరెవరికో తెలుసా?

— రజ్నీష్ కుమార్, ఎస్బీఐ ఛైర్మన్
ATM: గుడ్ న్యూస్... ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా
SBI: ఏటీఎం పనిచేయట్లేదా? కిరాణా షాప్‌లో డబ్బులు తీసుకోవచ్చు ఇలా
SBI ATM: ఛార్జీలు పడకుండా ఏటీఎంలో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయండి ఇలా
SBI ATM: ఎస్బీఐ ఏటీఎంలలో ఇక ఆ నోట్లు రావు... కారణం ఇదే
మీ ATM కార్డు మీ దగ్గరే ఉంటే... దొంగలు ఎలా మీ డబ్బు దోచేస్తున్నారు? తెలుసుకోండి
ATMలలో ఈ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలుండవ్... అవేంటో తెలుసా..?
HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి
Loading...
LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇవ్వొచ్చు తెలుసా
Paytm: మీ ఫోన్లో పేటీఎం యాప్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న కంపెనీ
Railways: ట్రైన్ టికెట్‌పై 100% వరకు కన్సెషన్... ఎవరెవరికో తెలుసా?
Loading...