హోమ్ /వార్తలు /బిజినెస్ /

Money: ఎస్‌బీఐ, పోస్టాఫీస్ స్కీమ్స్‌లో చేరితే రూ.10 లక్షలు.. ఎలా పొందొచ్చంటే?

Money: ఎస్‌బీఐ, పోస్టాఫీస్ స్కీమ్స్‌లో చేరితే రూ.10 లక్షలు.. ఎలా పొందొచ్చంటే?

 ఎస్‌బీఐ, పోస్టాఫీస్ స్కీమ్స్‌లో చేరితే రూ.10 లక్షలు.. ఎలా పొందొచ్చంటే?

ఎస్‌బీఐ, పోస్టాఫీస్ స్కీమ్స్‌లో చేరితే రూ.10 లక్షలు.. ఎలా పొందొచ్చంటే?

SBI FD Scheme | ఎస్‌బీఐ, పోస్టాఫీస్.. రెండూ కూడా దిగ్గజ సంస్థలు. ప్రభుత్వ బ్యాంకుల్లో ఎస్‌బీఐ అతిపెద్దది. బ్యాంకులు ధీటుగా పోస్టాఫీస్‌ కూడా కస్టమర్లకు పలు రకాల సేవలు అందిస్తోంది. సేవింగ్ స్కీమ్స్‌కు పోస్టాఫీస్ చాలా పాపులర్.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Post Office Fixed Deposits | దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అలాగే పోస్టాఫీస్ కూడా తన కస్టమర్లకు వివిధ రకాల సేవింగ్ స్కీమ్స్‌ను అందుబాటులో ఉంచింది. వీటిల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposit) కూడా ఉన్నాయి. అంటే రెండింటిలోనూ ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు అందబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు.

  మరి ఎందులో డబ్బులు పెడితే బెటర్? ఎక్కువ లాభం ఏ స్కీమ్స్‌లో వస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు రూ. 10 లక్షలు పొందాలని చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఏ స్కీమ్‌లో చేరితే ఎంత కాలానికి ఎంత మొత్తం పొందొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం. రెండింటిలోనూ ఒకే రకమైన వడ్డీ రేటు ఉండదు. అప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ కూడా మారుతుంది.

  బంగారం, వెండి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా పడిపోయిన ధరలు!

  ఎస్‌బీఐ ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్ 28.10.2022 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ టెన్యూర్ 1000 రోజులు. అంటే దాదాపు మూడేళ్లు. సాధారణ కస్టమర్లకు 6.1 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు 6.6 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే ఇక్కడ 6.1 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మూడేళ్లలో రూ.10 లక్షలు పొందాలంటే కస్టమర్లు రూ.8.35 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

  ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ సేవలు బంద్!

  అదే పోస్టాఫీస్ విషయానికి వస్తే.. పోస్టాఫీస్‌లో టైమ్ డిపాజిట్ స్కీమ్ ఉంది. ఇది స్మాల్ సేవింగ్ స్కీమ్. ఇండియా పోస్ట్ అందిస్తోంది. రూ.1000తో ఈ స్కీమ్‌లో చేరొచ్చు. టెన్యూర్ 5 ఏళ్ల వరకు ఉంటుంది. ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టెన్యూర్ ప్రాతిపదికన డబ్బులు ఎఫ్‌డీ చేయొచ్చు. ఏడాది నుంచి మూడేళ్ల వరకు అయితే వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది. అదే ఐదేళ్ల టెన్యూర్ ఎఫ్‌డీలపై అయితే 6.7 శాతం వడ్డీ వస్తుంది. 5.5 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మూడేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో రూ. 10 లక్షలు పొందాలని భావిస్తే.. రూ.8.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే ఐదేళ్లలో రూ.10 లక్షలు పొందాలంటే రూ.7.18 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐదేళ్ల టెన్యూర్‌పై వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. కాగా ఫిక్స్‌డ్  డిపాజిట్లు చేయడం వల్ల రిస్క్ లేకుండా రాబడి పొందొచ్చు. అయితే పటిష్టమైన బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోవడం ఉత్తమం. పోస్టాఫీస్‌లో డబ్బులకు ఎలాంటి రిస్క్ ఉండదు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Bank, FD rates, Fixed deposits, Personal Finance, Post office, Sbi, State bank of india

  ఉత్తమ కథలు