SBI Base Rate: ఎస్​బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. బేస్​ వడ్డీ రేటు తగ్గించిన బ్యాంక్​.. పూర్తి వివరాలు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎస్​బీఐ బేస్​ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

  • Share this:
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎస్​బీఐ బేస్​ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్​బీఐ వడ్డీ రేట్లు 5 బేసిస్​ పాయింట్లు.. అంటే 0.05 శాతం తగ్గనుంది. ఫలితంగా బేస్​ వడ్డీ రేట్లు 7.45 శాతంగా అమల్లో ఉంటాయి. అదే సమయంలో బెంచ్​ మార్క్​ ప్రైమ్​ లెండింగ్ రేట్ (బీపీఎల్​ఆర్​)ని కూడా 12.20 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ కొత్త రేట్లు నేటి (2021 సెప్టెంబర్ 15) నుంచి అమల్లోకి వచ్చాయి.

రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (Reserve Bank of India) ఈ బేస్​ రేట్లను నిర్ణయిస్తుంది. ఆర్​బీఐ బేస్​ రేట్లకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్బీఐ బేస్ రేటు 7.30 నుంచి -8.80 శాతం మధ్య ఉండటంతో ఎస్​బీఐ 7.45 శాతం బేస్​ రేటును నిర్ణయించింది. అయితే గృహ రుణాలపై ఇది వర్తించదు. ఎస్​బీఐ(State Bank of India) మే నెలలో గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం కేవలం 6.70 శాతం చొప్పున గృహ రుణాలను అందిస్తోంది. మహిళా ఖాతాదారులకు 5 బేసిస్​ పాయింట్ల ప్రత్యేక తగ్గింపు కూడా అందిస్తోంది.

దీనిపై ఎస్​బీఐ ట్వీట్​ చేస్తూ "ఆర్​బీఐ తాజా బేస్​ రేట్లకు( base rate) అనుగుణంగా ఎస్​బీఐ బేసిక్​ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాం. 7.45 శాతం బేస్ రేటు అమల్లో ఉంటుంది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే మహిళలకు ప్రత్యేకంగా 5 బిపిఎస్ వడ్డీ రాయితీ లభిస్తుంది. యోనో యాప్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు 5 బిపిఎస్‌ల అదనపు వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది’’ అని పేర్కొంది.

* 7.45 శాతానికి చేరిన బేస్ వడ్డీ రేటు
బ్యాంకులు కస్టమర్లకు రుణాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించిన వడ్డీ రేటునే బేస్ రేటు అంటారు. బీపీఎల్​ఆర్​ అనేది బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి వసూలు చేసే వడ్డీరేటుగా పేర్కొంటారు. ప్రైవేట్​ రంగ బ్యాంక్​ అయిన కోటక్​ మహీంద్రా బ్యాంక్​ గత వారం గృహ రుణ వడ్డీ రేట్లను 0.15 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో, కోటక్​ గృహ రుణ వడ్డీ రేటు 6.65 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశంలోని 16 బ్యాంకులతో పాటు ఇతర హౌసింగ్​ ఫైనాన్స్ కంపెనీలు 7 శాతం కంటే​ తక్కువ వడ్డీ రేటుతో గృహ రుణాలను మంజూరు చేస్తున్నాయి.
Published by:Sumanth Kanukula
First published: