దీపావళికి కొత్త కార్ ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నారా? బ్యాంకులు కార్లు కొనేవారికి తక్కువ వడ్డీకే వాహన రుణాలు (Vehicle Loans) ఇస్తున్నాయి. ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని లోన్ ఆఫర్స్ అందిస్తున్నాయి. కార్ లోన్ (Car Loan) తీసుకొని కొత్త వాహనం కొనాలనుకునేవారికిని ఆఫర్స్‌తో ఆకర్షిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలు మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ కార్లకు (Electric Cars) కూడా రుణాలు ఇస్తుండటం విశేషం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకులన్నీ తక్కువ వడ్డీకే కార్ లోన్లు అందిస్తుండటం విశేషం.
ఎలక్ట్రిక్ వాహనాలకు ఇటీవల డిమాండ్ పెరుగుతుండటం, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను లాంఛ్ చేస్తుండటంతో బ్యాంకులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లకు వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం విశేషం. మరి ఏ బ్యాంకులో వాహన రుణాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Free Petrol: 53 లీటర్ల పెట్రోల్ ఉచితం... ఈ క్రెడిట్ కార్డ్‌పై ఆఫర్
Axis Bank: యాక్సిస్ బ్యాంకులో ఎలక్ట్రిక్ కారుకు వడ్డీ 7.70 శాతం నుంచి, నాన్ ఎలక్ట్రిక్ వాహనానికి వడ్డీ 8.20 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎలక్ట్రిక్ కారుకు వడ్డీ 7.95 శాతం నుంచి, నాన్ ఎలక్ట్రిక్ వాహనానికి వడ్డీ 7.80 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.
Union Bank: యూనియన్ బ్యాంకులో ఎలక్ట్రిక్ కారుకు వడ్డీ 8.40 శాతం నుంచి, నాన్ ఎలక్ట్రిక్ వాహనానికి వడ్డీ 8.45 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎలక్ట్రిక్ కారుకు వడ్డీ 8.45 శాతం నుంచి, నాన్ ఎలక్ట్రిక్ వాహనానికి వడ్డీ 8.45 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.
Indian Bank: ఇండియన్ బ్యాంకులో ఎలక్ట్రిక్ కారుకు వడ్డీ 8.45 శాతం నుంచి, నాన్ ఎలక్ట్రిక్ వాహనానికి వడ్డీ 8.50 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.
Diwali Offer: కార్ కొంటే లక్ష రూపాయల డిస్కౌంట్... దివాళీ ఆఫర్ వివరాలివే
PNB: పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఎలక్ట్రిక్ కారుకు వడ్డీ 8.55 శాతం నుంచి, నాన్ ఎలక్ట్రిక్ వాహనానికి వడ్డీ 8.65 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.
Karnataka Bank: కర్నాటక బ్యాంకులో ఎలక్ట్రిక్ కారుకు వడ్డీ 8.69 శాతం నుంచి, నాన్ ఎలక్ట్రిక్ వాహనానికి వడ్డీ 8.79 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.
Canara Bank: కెనెరా బ్యాంకులో ఎలక్ట్రిక్ కారుకు వడ్డీ 8.80 శాతం నుంచి, నాన్ ఎలక్ట్రిక్ వాహనానికి వడ్డీ 8.90 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.
బ్యాంక్ బజార్ వెబ్సైట్లో 2022 అక్టోబర్ 14 నాటి సమాచారం ప్రకారం వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ ఆయా బ్యాంకుల్లో లభిస్తున్న తక్కువ వడ్డీ రేట్లు. అయితే కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోర్‌ను బట్టి వడ్డీ రేటు పెరగొచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీకే వాహన రుణాలు లభిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Bank loans, Diwali, Electric cars, Electric Vehicle, Sbi loans