Home /News /business /

STATE BANK OF INDIA SET TO LAUNCH HR SUBSIDIARY IN A BID TO REDUCE EMPLOYEE EXPENSES UMG GH

SBI: ఎస్‌బీఐ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఉద్యోగ ఖర్చులను తగ్గించుకునే పనిలో బ్యాంక్..!

ఎస్‌బీఐ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఉద్యోగ ఖర్చులను తగ్గించుకునే పనిలో బ్యాంక్..!

ఎస్‌బీఐ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఉద్యోగ ఖర్చులను తగ్గించుకునే పనిలో బ్యాంక్..!

హ్యూమన్‌ రిసోర్స్‌(HR) వ్యవహారాలను నిర్వహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఓ అనుబంధ సంస్థను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలను ఓ వార్తా సంస్థ ప్రచురించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
హ్యూమన్‌ రిసోర్స్‌(HR) వ్యవహారాలను నిర్వహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఓ అనుబంధ సంస్థను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలను ఓ వార్తా సంస్థ ప్రచురించింది. ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌ కంటే ఎక్కువగా ఉన్న ఎస్‌బీఐ కాస్ట్-టు-ఇన్‌కమ్ రేషియోను తగ్గించేందుకు ఈ అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇతర ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకులలో కాస్ట్‌-టు-ఇన్‌కమ్ రేషియో 30 నుంచి 40 శాతంగా ఉండగా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 53.3 శాతంగా ఉండటం గమనార్హం. అనుబంధ సంస్థ ఏర్పాటుకు ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుంచి ఎస్‌బీఐ సూత్రప్రాయంగా ఆమోదం పొందింది.

* మొదట గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభం
నివేదికలో పేర్కొన్న వివరాల మేరకు.. గ్రామీణ, సెమీ- అర్భన్‌ ప్రాంతాలలో తొలుత అనుబంధ సేవలు మొదలవుతాయి. అక్కడ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన రిక్రూట్‌ చేసుకున్న ఉద్యోగులతో హ్యూమన్‌ రిసోర్స్‌ సంబంధిత వ్యవహారాలను నిర్వహిస్తారు. సంజీవ్ నారాయణి హెచ్‌ఆర్ సంస్థ కింద ఎస్‌బీఐ హెచ్‌ఆర్‌ అనుబంధ సంస్థ పని చేసే అవకాశం ఉంది.

2022 మార్చి 31 నాటికి ఎస్‌బీఐ బ్యాంకులో 99,259 క్లరికల్ సిబ్బంది, 33,442 సబ్-స్టాఫ్, 1,11,549 మంది అధికారులు ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎస్‌బీఐ మొత్తం నిర్వహణ ఖర్చులలో జీతం 45.7 శాతం కాగా, రిటైల్ ప్రయోజనాలు, ఇతర కేటాయింపులు 12.4 శాతంగా ఉన్నాయి.

ఇదీ చదవండి: చిలుక తెచ్చిన తంటా.. పోలీస్ స్టేషన్‌కి చేరిన పంచాయితీ.. చదవితే అవాక్కవుతారు..!


* స్వల్పంగా క్షీణించిన ఎస్‌బీఐ నెట్‌ ప్రాఫిట్‌
2022 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇయర్‌ ఆన్‌ ఇయర్‌(YoY) నెట్‌ ప్రాఫిట్‌ స్వల్పంగా క్షీణించి రూ.6.068.08 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరం బ్యాంక్ రూ.6504 కోట్ల నెట్‌ ప్రాఫిట్‌ పొందింది. ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 6.7 శాతం క్షీణించింది. 2022 మార్చి 31తో ముగిసిన మునుపటి త్రైమాసికంలో రూ.9,113.53 కోట్ల లాభాన్ని ప్రకటించిన ఎస్‌బీఐ.. క్వార్టర్-ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన నెట్‌ ప్రాఫిట్‌ను భారీగా కోల్పోయింది. 2022-23 మొదటి త్రైమాసికంలో ఎస్‌బీఐ స్టాండ్‌లోన్ మొత్తం ఆదాయం రూ.74,998.57 కోట్లకు తగ్గింది. ఇది ఏడాది క్రితం ఇదే సమయంలో రూ.77,347.17 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో ఎస్‌బీఐ ఇతర ఆదాయం రూ.2,312.2 కోట్లుగా ఉంది. ఇది ఒక సంవత్సరం క్రితం రూ.11,802.7 కోట్లు. అంతకుముందు త్రైమాసికంలో రూ.11,880.2 కోట్లుగా ఉంది.



* తగ్గిన నాన్‌ పర్‌ఫార్మింగ్‌ అసెట్స్‌
బ్యాంక్ గ్రాస్‌ నాన్‌ పర్‌ఫార్మింగ్‌ అసెట్స్‌ (NPA) నిష్పత్తి గత ఏడాది జూన్ చివరి నాటికి 5.32 శాతం నుంచి 3.91 శాతానికి మెరుగుపడింది. అలాగే నెట్‌ NPAలు ఏడాది క్రితం 1.7 శాతం నుంచి 2022 జూన్‌లో 1.02 శాతానికి తగ్గాయి. బ్యాంక్ గ్రాస్‌ అడ్వాన్సులు రిటైల్ పర్సనల్ అడ్వాన్స్‌ల ద్వారా 14.93 శాతం వృద్ధిని చూపించాయి. వీటిలో గృహ రుణాలు 13.77 శాతం పెరిగాయి. బ్యాంక్ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.25 లక్షల కోట్ల నుంచి రూ.29 లక్షల కోట్ల గ్రాస్‌ అడ్వాన్సులను ప్రకటించింది. కార్పొరేట్ లోన్‌ బుక్‌ 10.57 శాతం, SME, వ్యవసాయ రుణాలు కూడా వరుసగా 10.01 శాతం, 9.82 శాతం వృద్ధిని నమోదు చేశాయి. డిపాజిట్లు 8.73 శాతం పెరిగి రూ.40 లక్షల కోట్లకు చేరుకున్నాయి. జూన్ 30 నాటికి బ్యాంక్ CASA నిష్పత్తి 64 బేసిస్ పాయింట్లు తగ్గి 45.33 శాతానికి చేరుకుంది. హోల్‌సేల్ బ్యాంక్ డిపాజిట్ సంవత్సరానికి 8.73 శాతం పెరిగింది.
Published by:Mahesh
First published:

Tags: Bank, Bank news, Sbi, State bank of india

తదుపరి వార్తలు