SBI Good News: ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి... ఎందుకో తెలుసా?

State Bank of India | జూలై 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంది. రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ అమలులోకి వస్తే వడ్డీ రేట్లు భారీగా తగ్గుతాయి.

news18-telugu
Updated: June 8, 2019, 11:30 AM IST
SBI Good News: ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి... ఎందుకో తెలుసా?
ఎస్‌బీఐ‌లో ఉద్యోగాలు
  • Share this:
ఇంటి కోసం రుణాలు తీసుకునేవారికి శుభవార్త. జూలై 1 నుంచి రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్‌ను అమలు చేయనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే వడ్డీ రేట్లు ఎంత అన్నది రెపో రేట్‌పై ఆధారపడి ఉంటుంది. దీంతో జూలై 1 నుంచి హోమ్ లోన్ వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. రెండు రోజుల క్రితమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్‌ను 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఆ లాభాలను కస్టమర్లకు బదిలీ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. జూలై 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంది. రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ అమలులోకి వస్తే వడ్డీ రేట్లు భారీగా తగ్గుతాయి.

రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ అంటే ఏంటీ?



సాధారణంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్ లెండింగ్ రేట్(MCLR) ఆధారంగా రుణాలపై వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంటాయి బ్యాంకులు. ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించినా ఆ లాభం కస్టమర్లకు చేరదు. అదే వడ్డీ రేట్లను రెపో రేట్‌కు లింక్ చేస్తే కస్టమర్లకు మేలు కలుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు జూలై 1 నుంచి రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ ఆఫర్ చేయాలని నిర్ణయించింది. ఉదాహరణకు ప్రస్తుతం రెపో రేట్ 5.75 శాతం కాబట్టి దానికి మరో 2.65 శాతం కలిపి హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే హోమ్ లోన్ వడ్డీ రేటు 8.40 శాతంగా ఉంటుంది. ఇకపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించినప్పుడల్లా ఆ లాభం కస్టమర్లకు చేరుతుంది.

అంతేకాదు క్యాష్ క్రెడిట్ అకౌంట్, ఓవర్ డ్రాఫ్ట్ కస్టమర్లకు కూడా రెపో లింక్డ్ లెండింగ్ రేట్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ వడ్డీ రేటు 8 శాతం. రూ.1 లక్ష కన్నా ఎక్కువ రుణాలు తీసుకునేవారికే ఇది వర్తిస్తుంది.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:Budget 2019 : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు టాప్-10 స్మార్ట్‌ఫోన్లు ఇవే...

World Cup Offer: ఏడాదంతా ప్యారడైజ్ బిర్యానీ ఫ్రీ... కండీషన్స్ అప్లై

Jio Effect: 5 ఫోన్ నెంబర్లకు ఒకటే బిల్... వొడాఫోన్ ఆఫర్
First published: June 8, 2019, 11:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading