SBI Alert: ఈ తప్పుతో మీ డబ్బులు పోతే బ్యాంకుకు సంబంధం లేదంటున్న ఎస్బీఐ
SBI Alert | ఏ చిన్న సమాచారం దొరికినా సులువుగా డబ్బులు నొక్కేసే కేటుగాళ్లు ఉన్నారు. అలాంటివారి బారిన పడకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను తరచూ హెచ్చరిస్తూనే ఉంటుంది.
news18-telugu
Updated: November 14, 2019, 5:43 PM IST

SBI Alert: ఈ తప్పుతో మీ డబ్బులు పోతే బ్యాంకుకు సంబంధం లేదంటున్న ఎస్బీఐ (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: November 14, 2019, 5:43 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు మరో హెచ్చరిక జారీ చేసింది. మీ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, వ్యక్తిగత వివరాలు, అకౌంట్ సంబంధిత సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మీ అకౌంట్ నుంచి డబ్బులు పోయినట్టైతే దానికి తాము బాధ్యత వహించమని హెచ్చరించింది ఎస్బీఐ. కొందరు కస్టమర్లు తమ సేవింగ్స్ అకౌంట్ నెంబర్లతో పాటు ఇతర వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయం ఎస్బీఐ దృష్టికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన బ్యాంకు... కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. దయచేసి ఎవరూ ముఖ్యమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని బ్యాంకు కోరుతోంది. ఇలా షేర్ చేయడం ద్వారా అకౌంట్లో డబ్బులు పోగొట్టుకున్నా, మరేవిధంగానైనా నష్టపోయినా దానికి బ్యాంకు బాధ్యత వహించదని ఎస్బీఐ తేల్చి చెప్పింది. కస్టమర్లను హెచ్చరిస్తూ ఎస్బీఐ పోస్ట్ చేసిన ట్వీట్స్ ఇవే.
అంతేకాదు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగులు లేదా సిబ్బంది ఎవరూ పేమెంట్ లింక్స్ పంపరని, యూపీఐ, యూజర్ ఐడీ, పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్, సీవీవీ, ఓటీపీ లాంటి కీలకమైన సమాచారాన్ని ఫోన్, ఎస్ఎంఎస్, ఇమెయిల్స్‌లో అడగరని బ్యాంకు చెబుతోంది. ఏ చిన్న సమాచారం దొరికినా సులువుగా డబ్బులు నొక్కేసే కేటుగాళ్లు ఉన్నారు. అలాంటివారి బారిన పడకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను తరచూ హెచ్చరిస్తూనే ఉంటుంది. అందులో భాగంగా మరోసారి ఈ వార్నింగ్ మెసేజ్ ఇచ్చింది ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాదు... అన్ని బ్యాంకులూ కస్టమర్లను ఎలాంటి సమాచారాన్ని ఆన్లైన్లో షేర్ చేయకూడదని హెచ్చరిస్తుంటాయి. కాబట్టి మీ అకౌంట్ వివరాలు, పిన్, పాస్వర్డ్, ఓటీపీ ఎవరికీ షేర్ చేయొద్దు.
Redmi Note 8T: రెడ్మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Tirumala Tickets: తిరుమల 'స్పెషల్ ఎంట్రీ దర్శనం' టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఇదే
Apps: మీ ఫోన్లో ఈ 47 యాప్స్‌లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే డిలిట్ చేయండి
Credit Card: క్రెడిట్ కార్డు ఉందా? ఈ తప్పులు మీరూ చేస్తున్నారా?
DISCLAIMER: Please do not share your account no., mobile no. or any personal or account related information publicly on this platform for security reasons. Bank will not be responsible for any loss. We request you to delete the information immediately and re-post/DM (1/3)
— State Bank of India (@TheOfficialSBI) November 14, 2019
Good News: త్వరలో ఇన్స్యూరెన్స్ పాలసీలు అమ్మనున్న పోస్ట్‌మ్యాన్
SBI YONO: డిసెంబర్ 10 నుంచి ఎస్బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్... 50% వరకు డిస్కౌంట్స్
ATM: గుడ్ న్యూస్... ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా
HDFC Bank: మూడు రోజులుగా పనిచేయని నెట్ బ్యాంకింగ్... హెచ్డీఎఫ్సీ కస్టమర్లలో ఆందోళన
Govt Jobs: గుడ్ న్యూస్... ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఉండవు... సెట్ మాత్రమే
HDFC Bank: హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు షాక్... పనిచేయని నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్
Redmi Note 8T: రెడ్మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి
Loading...
ఇవి కూడా చదవండి:
Tirumala Tickets: తిరుమల 'స్పెషల్ ఎంట్రీ దర్శనం' టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఇదే
Apps: మీ ఫోన్లో ఈ 47 యాప్స్‌లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే డిలిట్ చేయండి
Credit Card: క్రెడిట్ కార్డు ఉందా? ఈ తప్పులు మీరూ చేస్తున్నారా?
Loading...