దేశవ్యాప్తంగా ఉన్న 42 కోట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు బ్యాంకు వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఫేక్ మెసేజెస్‌పై కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది ఎస్బీఐ. ఇండియాలో బ్యాంకింగ్ మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. బ్యాంకు కస్టమర్లకు మోసగాళ్ల వల వేసి అకౌంట్లు ఖాళీ చేసే ఘటనల్ని రోజూ చూస్తూనే ఉంటాం. ఎస్బీఐకి దేశవ్యాప్తంగా 42 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. కాబట్టి బాధితుల్లో కూడా ఎస్బీఐ కస్టమర్లు ఎక్కువగా ఉంటారనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే బ్యాంకు ఎప్పుడూ కస్టమర్లను హెచ్చరిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎస్బీఐ పేరుతో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని, మిస్లీడ్ చేసే ఫేక్ మెసేజెస్‌ని పట్టించుకోవద్దని ఎస్బీఐ కస్టమర్లను కోరుతోంది. ఇక సోషల్ మీడియాలో లేదా మీకు ఇమెయిల్స్, ఎస్ఎంఎస్లు పంపి, కాల్స్ చేసి మీ బ్యాంకు వివరాలు అడిగితే అస్సలు చెప్పొద్దు. తాము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని నమ్మించినా మీరు మీ కార్డు వివరాలు, ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏవైన అప్డేట్స్ చేయాలంటే బ్యాంకుకు వెళ్లి వివరాలు అప్చేడ్ చేయించాలి.
సోషల్ మీడియాలో మాత్రమే కాదు... మీకు ఇమెయిల్స్, మెసేజెస్, వాట్సప్‌లో ఎస్బీఐ పేరుతో వచ్చే సందేశాలను పట్టించుకోవద్దు. ఏ సమాచారం కావాలన్నా ఎస్బీఐ అధికారిక ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రమే చూడాలి. సోషల్ మీడియాలో అయితే ఎస్బీఐ అధికారిక హ్యాండిల్స్ మాత్రమే ఫాలో కావాలి. కొద్ది రోజుల క్రితం http://www.onlinesbi.digital పేరుతో ఓ వెబ్సైట్ ఎస్బీఐ కస్టమర్లకు వల వేసిన సంగతి తెలిసిందే. దీనిపై సమాచారం అందుకున్న ఎస్బీఐ అది నకిలీ వెబ్సైట్ అని కస్టమర్లను హెచ్చరించింది.
Fraudsters are using new ways & techniques to commit cybercrimes. Here’s a new way people are scammed in India. If you come across any such instances, please inform us through e-mail to: epg.cms@sbi.co.in & report.phishing@sbi.co.in & also report on: https://t.co/L3ihBoE1kS#SBIpic.twitter.com/O7gXx7QhlQ
మీకు ఇలాంటి నకిలీ వెబ్‌సైట్స్ లేదా ఎస్బీఐ పేరుతో నకిలీ మెయిల్స్, మెసేజెస్ వస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేయొచ్చు. https://cybercrime.gov.in/ వెబ్సైట్లో కంప్లైంట్ చేయొచ్చు. వీటిపై బ్యాంకుకు కూడా సమాచారం ఇవ్వొచ్చు. ఇలాంటి మెయిల్స్, మెసేజెస్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని epg.cms@sbi.co.in. లేదా phishing@sbi.co.in ఇమెయిల్ ఐడీలకు మెయిల్ పంపండి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.