SBI: ఆ ఎస్ఎంఎస్ వస్తే డిలిట్ చేయండి... ఖాతాదారులకు ఎస్‌బీఐ అలర్ట్

SBI: ఆ ఎస్ఎంఎస్ వస్తే డిలిట్ చేయండి... ఖాతాదారులకు ఎస్‌బీఐ అలర్ట్ (ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert | ఎస్‌బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఎస్ఎంఎస్ వస్తే వెంటనే డిలిట్ చేయమని కోరుతోంది.

  • Share this:
    మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తుంటారా? మీరు ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ సరిగ్గా చూసి వాడుతున్నారా? లేక నకిలీ వెబ్‌సైట్ వలలో పడుతున్నారా? ఓ నకిలీ వెబ్‌సైట్ కస్టమర్లకు వల వేస్తుందని గుర్తించిన బ్యాంకు ఖాతాదారులను హెచ్చరిస్తోంది. http://www.onlinesbi.digital పేరుతో ఉన్న వెబ్‌సైట్ నకిలీదని బ్యాంకు అప్రమత్తం చేస్తోంది. సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త టెక్నిక్స్‌తో మోసాలకు పాల్పడుతున్నారని, ఇది మరో తరహా మోసమని ఎస్‌బీఐ అభిప్రాయపడింది. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ పేజ్ లాగానే ఉంటుందని, ఇలాంటి డూప్లికేట్ వెబ్‌సైట్స్, యాప్స్‌తో కస్టమర్లను మోసం చేస్తున్నారని ఎస్‌బీఐ హెచ్చరించింది. ఒకవేళ మీకు ఇలాంటి లింక్స్‌తో ఏవైనా ఎస్ఎంఎస్‌లు వస్తే వెంటనే డిలిట్ చేయాలని, మీ యూజర్ ఐడీ, కార్డు వివరాలు, పిన్, ఓటీపీ షేర్ చేయొద్దని సూచించింది.


    ఒకవేళ మీకు ఈ వెబ్‌సైట్ లింక్‌తో ఏదైనా ఎస్ఎంఎస్, ఇమెయిల్ వస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వండి. epg.cms@sbi.co.in. లేదా phishing@sbi.co.in ఇమెయిల్ ఐడీలకు మెయిల్ చేయండి. ప్రభుత్వ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు https://cybercrime.gov.in/ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చు. మీరు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ చేయాలనుకుంటే ఎస్‌బీఐ అధికారిక ప్లాట్‌ఫామ్స్ మాత్రమే ఉపయోగించండి.

    ఇవి కూడా చదవండి:

    Jan Dhan Yojana: జన్ ధన్ అకౌంట్‌లోకి డబ్బులు వచ్చాయి... బ్యాలెన్స్ చెక్ చేయండిలా

    EMI Moratorium: మారటోరియం విషయంలో ఈ తప్పు చేస్తే మీ అకౌంట్ ఖాళీ

    Personal Finance Tips: ఈ టిప్స్‌తో బ్యాంకులో మీ డబ్బులు సేఫ్

    Prepaid Plans: రోజూ 1.5 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి ప్లాన్స్ ఇవే
    Published by:Santhosh Kumar S
    First published: