భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల భ్రదతను దృష్టిలో పెట్టుకుని కొన్ని జాగ్రత్తలు ప్రకటించింది. ముఖ్యంగా పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాలపై దృష్టి సారించాలని తెలిపింది. ఇటీవల కాలంలో కోవిడ్ మహమ్మారి అన్నిరంగాల రూపురేఖలను మార్చివేసింది. గడపదాటి బయటకు వెళ్లలేని పరిస్థితులలో అన్నింటికీ ఆన్‌లైన్ కార్యకలాపాలే దిక్కయ్యాయి. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వివిధరకాల యాప్‌ల ద్వరా ఖాతాదారులను బుట్టలో వేసుకుని వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎస్‌బీఐ ఒక ట్వీట్ చేసింది.
PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింకింగ్‌కు 2 వారాలే గడువు... చేయకపోతే ఈ చిక్కులు తప్పవు
Online Gold: ఆన్‌లైన్‌లో నగలు కొనేముందు ఈ 9 టిప్స్ గుర్తుంచుకోండి
తెలియని వ్యక్తులు చెప్పేమాటలు నమ్మి ఎటువంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దని స్టేట్ బ్యాంక్ హెచ్చరించింది. కేవలం వెరిఫైడ్ సోర్సెస్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరింది. నకిలీ యాప్స్ వల్ల జరిగే ప్రమాదాన్నీ బ్యాంకు వివరింంచింది. వీటి ద్వారా ఖాతాదారులకు తెలియకుండా వారి మెస్సేజ్‌లు, ఓటీపీ, సీవీవీ, పిన్ నెంబర్లను సైబర్ కేటుగాళ్లు సేకరించే ప్రమాదం ఉందని తెలియజేసింది. ఆఫ్‌లైన్ నగదు చెల్లింపుల కోసం డెబిట్ కార్డులను ఉపయోగించడం ఉత్తమమని సూచించింది. ఎన్.ఎఫ్.సి.(నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) ఆధారిత డెబిట్ కార్డుల ద్వారా నగదు చెల్లింపులు క్షేమమని చెప్పింది. పీఓఎస్ మెషీన్లలో టాప్ అండ్ పే ద్వారా తమ ఖాతాదారులు కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేయవచ్చని సూచించింది.
SBI Offer: ఎస్‌బీఐలో ఆ అకౌంట్ ఉన్నవారికి రూ.2,00,000 ఉచిత ఇన్స్యూరెన్స్
LIC Policy: మీ జీతంలో కొంత పొదుపు చేయండి... మెచ్యూరిటీ తర్వాత రూ.70 లక్షలు మీవే
మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా తమ ఖాతాదారులకు ఓ ముఖ్యమైన సూచన చేసింది. తమ బ్యాంక్ కాల్ సెంటర్‌కు కాల్ చేయాలనుకునేవారు.. సంబంధిత నెంబర్ల కోసం ఇతర వెబ్‌సైట్లలో వెతికి, చిక్కుల్లో పడవద్దని కోరింది. ఇందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లోకి మాత్రమే లాగిన్ కావాలని కోరింది. సురక్షితమైన ట్రాన్సాక్షన్ల కోసం సంస్థకు చెందిన నెట్ బ్యాంకింగ్, వెబ్‌సైట్లను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. కస్టమర్లందరూ ఆన్ లైన్ కార్యకలాపాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే.. ఖాతాలు ఖాళీ అవుతాయని ఈ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి... మరి జాగ్రత్త సుమా!!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank account, Banking, CYBER CRIME, CYBER FRAUD, FAKE APPS, Mobile App, Mobile Banking, Sbi, State bank of india