Home /News /business /

STATE BANK OF INDIA SBI WARNS CUSTOMERS TO LINK THEIR AADHAAR NUMBER TO PAN CARD TO AVOID INCONVENIENCE IN BANKING SERVICES SS

SBI Alert: జూన్ 30 లోగా ఈ పనిచేయండి... కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక

SBI Alert: జూన్ 30 లోగా ఈ పనిచేయండి... కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert: జూన్ 30 లోగా ఈ పనిచేయండి... కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక (ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు అలర్ట్. జూన్ 30 లోగా పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని ఎస్‌బీఐ కస్టమర్లను కోరుతోంది. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోండి.

    పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ జూన్ 30 వరకు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అంటే పాన్, ఆధార్ లింకింగ్‌కు ఇంకొన్ని రోజులే గడువుంది. దీంతో తమ బ్యాంకు కస్టమర్లను ఎస్‌బీఐ అప్రమత్తం చేస్తోంది. జూన్ 30 లోగా తప్పనిసరిగా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని కోరుతోంది. బ్యాంకింగ్ లావాదేవీల్లో, బ్యాంకింగ్ సేవల్లో ఇబ్బందులు ఎదురుకోకుండా వెంటనే ఈ పనిచేయాలని ఎస్‌బీఐ కోరుతోంది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి అని చెబుతోంది. ఒకవేళ జూన్ 30 లోగా పాన్, ఆధార్ లింక్ చేయకపోయినా, పాన్ కార్డు యాక్టీవ్‌గా లేకపోయినా లావాదేవీల్లో పాన్ నెంబర్‌ను వెల్లడించకూడదని ఎస్‌బీఐ తెలిపింది.

    పాన్ కార్డు ఉన్నవాళ్లు తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే చాలాసార్లు గడువు పొడిగించింది. చివరిసారిగా ఈ ఏడాది జూన్ 30 వరకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికీ ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డ్ హోల్డర్లు లక్షల్లో ఉంటారని అంచనా. అందుకే పదేపదే గడువు పొడిగిస్తూ వస్తోంది ఆదాయపు పన్ను శాఖ. మరి ఈసారి గడువు పొడిగిస్తుందో లేదో తెలియదు. కాబట్టి పాన్ కార్డ్ హోల్డర్లు జూన్ 30 లోగా తమ పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయాలి. లేకపోతే జూలై 1 నుంచి పాన్ కార్డ్ ఇనాక్టీవ్‌గా మారిపోతుంది. ఆధార్ లింక్ చేయని పాన్ నెంబర్లను ఎక్కడా లావాదేవీల సమయంలో వెల్లడించకూడదు. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డ్ చెల్లనిదిగా మారిపోతుంది. ఒకవేళ ఆధార్ లింక్ చేయని పాన్ నెంబర్ ఎక్కడైనా ఉపయోగిస్తే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం, భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరపడం లాంటివాటికి పాన్ కార్డు తప్పనిసరి.

    PF Aadhaar Link: మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేశారా? వెంటనే చేయండి ఇలా

    EPF Account: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... అకౌంట్‌లోకి వడ్డీ జమ చేసేది ఎప్పుడంటే


    మరి మీరు మీ పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేశారా? ఈ విషయాన్ని సులువుగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక మీరు ఇప్పటివరకు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయనట్టైతే నాలుగు పద్ధతుల్లో చేయొచ్చు. ఎస్ఎంఎస్, ఆన్‌లైన్, ఆదాయపు పన్ను రిటర్న్స్, పాన్ కార్డ్ అప్లికేషన్ ద్వారా పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయడం సాధ్యం. ఇందుకోసం ఈ కింద్ స్టెప్స్ ఫాలో అవండి.

    SMS: ఎస్ఎంఎస్ ద్వారా పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయడానికి 567678 లేదా 56161 నెంబర్లకు కింద సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి. UIDPAN<space><12 అంకెల ఆధార్><space><10 అంకెల పాన్> అని టైప్ చేసి మెసేజ్ చేయాలి. ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్ 111122223333, మీ పాన్ నెంబర్ AAAPA9999Q అనుకుంటే UIDPAN 111122223333 AAAPA9999Q ఈ ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి.

    Aadhaar: ఆధార్ వెరిఫికేషన్ కోసం కొత్త సర్వీస్... ఇలా వాడుకోండి

    SBI Insurance: ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.40 లక్షల వరకు ఇన్స్యూరెన్స్... అప్లై చేయండి ఇలా

    ఇక ఆన్‌లైన్‌లో పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయడానికి https://www.incometaxindiaefiling.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో Link Aadhaar పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో ఆధార్‌కార్డుపై ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'Link Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.

    మరోవైపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో పాన్-ఆధార్ లింక్ చేయొచ్చు. NSDL (tin-nsdl.com), UTIITSL (utiitsl.com) వెబ్‌‌సైట్లల్లో ఐటీఆర్ ఫైలింగ్ చేసేప్పుడు పాన్-ఆధార్ లింక్ చేయాలి.

    కొత్తగా పాన్ కార్డు తీసుకునేవాళ్లు, పాన్ కార్డులో మార్పులు చేయించేవాళ్లు దరఖాస్తులోనే ఆధార్ నెంబర్ వివరిస్తే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Aadhaar, Aadhaar card, AADHAR, PAN, PAN card

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు