Home /News /business /

STATE BANK OF INDIA SBI WARNS CUSTOMERS ABOUT FAKE LOAN OFFERS AND FAKE COMPANIES SS

SBI Loans: ఎస్‌బీఐలో లోన్ ఇస్తామని ఫోన్ వచ్చిందా? అయితే అలర్ట్

SBI Loans: ఎస్‌బీఐలో లోన్ ఇస్తామని ఫోన్ వచ్చిందా? అయితే అలర్ట్
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Loans: ఎస్‌బీఐలో లోన్ ఇస్తామని ఫోన్ వచ్చిందా? అయితే అలర్ట్ (ప్రతీకాత్మక చిత్రం)

SBI Loans | ఎస్‌బీఐలో రుణాలు ఇప్పిస్తామని ఎవరైనా కాల్ చేస్తే నమ్మొద్దంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వార్నింగ్ ఇస్తోంది.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI నుంచి మాట్లాడుతున్నామని మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా? ఎస్‌బీఐలో పర్సనల్ లోన్, ఆటో లోన్, బిజినెస్ లోన్ ఇప్పిస్తామని చెప్పారా? అయితే అలర్ట్. ఇలాంటి కాల్స్ వస్తే మీరు అప్రమత్తం కావాల్సిందే. మామూలుగా బ్యాంకులకు చెందిన ప్రతినిధులు లోన్లు, క్రెడిట్ కార్డులు ఇస్తామని ఫోన్లు చేస్తుంటారు. ఇలా వచ్చే ఫోన్లల్లో మోసాలు కూడా ఉంటాయి. ఎస్‌బీఐ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో ఏకంగా ఓ సంస్థను పెట్టి అమాయకులను మోసం చేస్తున్న ఘటనలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఏకంగా భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ పేరుతో నకిలీ సంస్థలు సృష్టించి రుణాల పేరుతో వల వేస్తున్నారు మోసగాళ్లు. పెద్దగా డాక్యుమెంట్స్ అవసరం లేకుండా, సులువుగా రుణాలు ఇస్తామని నమ్మిస్తున్నారు. ఇలాంటి మోసాలు జరుగుతున్నట్టు ఎస్‌బీఐ దృష్టికి వచ్చింది. దీంతో ఎస్‌బీఐ కస్టమర్లను హెచ్చరిస్తోంది. ఎస్‌బీఐ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో తమకు ఎలాంటి సంస్థ లేదని, అలాంటి సంస్థలతో తమకు ఏ సంబంధం లేదని ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చింది.

    EPF Withdrawal: ఈపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయాలా? ఎంత తీసుకోవచ్చో తెలుసుకోండి

    EPF Account: జాబ్ మానేసిన తర్వాత మీ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయలేదా? ఈ విషయం తెలుసా?


    ఎస్‌బీఐ ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. ఎస్‌బీఐ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతోనే కాదు, ఎస్‌బీఐ పేరు చెప్పుకొని మోసగాళ్లు కస్టమర్లను కాంటాక్ట్ చేస్తున్నారు. రుణాలు ఇప్పిస్తామంటూ మోసాలు చేస్తున్నారు. కస్టమర్లను నమ్మించేందుకు ఎస్‌బీఐ లోగో, బ్రాండ్ వాడుకుంటున్నారు. ఎస్‌బీఐ లోగో చూడగానే కస్టమర్లు నిజంగానే ఎస్‌బీఐ సిబ్బంది సంప్రదించారని భావించి మోసపోతున్నారు. అందుకే ఎస్‌బీఐ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది. రుణాల పేరుతో వచ్చే కాల్స్‌ని పట్టించుకోవద్దని, ఎస్ఎంఎస్, మెయిల్స్‌లో వచ్చే లింక్స్ క్లిక్ చేయొద్దని వార్నింగ్ ఇస్తోంది. ఒకవేళ రుణాలు అవసరమైతే కస్టమర్లు నేరుగా దగ్గర్లోని బ్రాంచ్‌కు వెళ్లి సంప్రదిస్తే మంచిది. మధ్యవర్తులను నమ్ముకుంటే మోసపోయే అవకాశాలు ఉంటాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank loans, Car loans, Gold loans, Home loan, Housing Loans, Loan apps, Personal Loan, Sbi, State bank of india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు