SBI Warning: మోసపోతారు జాగ్రత్త... ఖాతాదారులకు ఎస్‌బీఐ హెచ్చరికలు

SBI Warning | లాటరీ తగిలిందనో, మీ కార్డ్ ఎక్స్‌పైరీ అవుతుందనో, మీ అకౌంట్ బ్లాక్ చేస్తామనో నమ్మించి కీలక వివరాలు సేకరిస్తారు. వాటితో మీకు తెలియకుండా లావాదేవీలు జరిపి మీ అకౌంట్‌లో డబ్బుల్ని కాజేస్తారు.

news18-telugu
Updated: May 30, 2019, 4:27 PM IST
SBI Warning: మోసపోతారు జాగ్రత్త... ఖాతాదారులకు ఎస్‌బీఐ హెచ్చరికలు
SBI Warning: మోసపోతారు జాగ్రత్త... ఖాతాదారులకు ఎస్‌బీఐ హెచ్చరికలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉపయోగిస్తున్నారా? తరచూ లావాదేవీలు చేస్తుంటారా? అయితే జాగ్రత్త అని హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. సైబర్ మోసాలు పెరిగిపోతుండటంతో లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. అపరిచితులకు పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు అస్సలు చెప్పొద్దని హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. ఎక్కువగా కాల్స్, ఎస్ఎంఎస్, ఇమెయిల్స్ ద్వారా ఇలాంటి సమాచారం సేకరించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తారు. లాటరీ తగిలిందనో, మీ కార్డ్ ఎక్స్‌పైరీ అవుతుందనో, మీ అకౌంట్ బ్లాక్ చేస్తామనో నమ్మించి కీలక వివరాలు సేకరిస్తారు. వాటితో మీకు తెలియకుండా లావాదేవీలు జరిపి మీ అకౌంట్‌లో డబ్బుల్ని కాజేస్తారు. అందుకే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తోంది ఎస్‌బీఐ. ఆ టిప్స్ ఇవే.

1. అనుమానాస్పద ఇమెయిల్స్ ఓపెన్ చేయొద్దు. అందులో లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి.

2. గూగుల్ ప్లే స్టోర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక యాప్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
3. లాటరీ తగిలిందని వచ్చే ఎస్ఎంఎశ్‌లను అస్సలు పట్టించుకోవద్దు.
4. సైబర్ నేరగాళ్లు బ్యాంకు నుంచి మెయిల్స్ పంపినట్టు మిమ్మల్ని నమ్మిస్తారు. మీ అకౌంట్ వివరాలు తెలపాలని కోరతారు. బ్యాంకులు మీ అకౌంట్ వివరాలు అడగవన్న విషయం గుర్తుంచుకోండి.
5. సైబర్ నేరగాళ్ల కాల్స్ విషయంలో జాగ్రత్త. బ్యాంకు మేనేజర్‌ను మాట్లాడుతున్నానని నమ్మిస్తారు కేటుగాళ్లు. బ్యాంకు ప్రతినిధులెవరూ మీ కార్డ్ నెంబర్లు, పిన్ నెంబర్లు అడగరు.
6. మీ అకౌంట్ వివరాలు చెప్తే అప్‌డేట్ చేస్తామని ఎవరైనా అడిగితే అనుమానించాల్సిందే. ఏదైనా ఉంటే బ్యాంకుకు వచ్చి అప్‌డేట్ చేస్తామని చెప్పండి.7. కొత్త వర్షన్ బ్రౌజర్లు మాత్రమే ఉపయోగించండి. Google chrome, IE 7.0, Mozilla Firefox 3.1, Opera 9.5, Safari 3.5 వర్షన్ల కన్నా ఎక్కువ ఉండే బ్రౌజర్లే వాడాలి.
8. మీ కంప్యూటర్‌ను రెగ్యులర్‌గా యాంటీవైరస్‌తో స్కాన్ చేస్తూ ఉండాలి.
9. మీ అకౌంట్ పాస్‌వర్డ్స్, మీ కార్డుల పిన్ నెంబర్స్ తరచూ మారుస్తుండాలి.
10. మీ అకౌంట్ లాగిన్ వివరాలు చెక్ చేస్తూ ఉండాలి. ఏదైనా అనుమానంగా అనిపిస్తే బ్యాంకులో కంప్లైంట్ చేయాలి.
11. ఇంటర్నెట్ సెంటర్స్, అపరిచితుల కంప్యూటర్లల్లో అకౌంట్ లావాదేవీలు చేయకూడదు.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

IRCTC: గోవాలో బస్ ట్రిప్... జస్ట్ రూ.400 మాత్రమే

IRCTC: ఐఆర్‌సీటీసీ యాప్‌లో పోర్న్ యాడ్స్... కంప్లైంట్ ఇచ్చిన యూజర్‌కు షాకిచ్చే రిప్లై

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 107 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: May 30, 2019, 4:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading