మీరు తరచూ మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటారా? అయితే మీకు శుభవార్త. ఇకపై ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-IMPS లావాదేవీలపైనా ఛార్జీలను తొలగించనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలపై 2019 ఆగస్ట్ 1 నుంచి ఐఎంపీఎస్ ఛార్జీలు ఉండవు. ఇటీవలే ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఛార్జీలను తొలగించింది ఎస్బీఐ. ఐఎంపీఎస్ ఛార్జీలను మాత్రం వసూలు చేస్తోంది. త్వరలో మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఐఎంపీఎస్ ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ఐఎంపీఎస్ ఆప్షన్ ఎంచుకోవడం అలవాటే. ఐఎంపీఎస్ ద్వారా క్షణాల్లో డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబల్ బ్యాంకింగ్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తేనే ఐఎంపీఎస్ ఛార్జీలు ఉండవు. బ్రాంచ్ల దగ్గర లావాదేవీలు జరిపితేమాత్రం ఐఎంపీఎస్ ఛార్జీలు చెల్లించాల్సిందే.
ఇకపై ఐఎంపీఎస్ ఛార్జీలు ఇలా ఉంటాయి...
రూ.1,000 వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు
రూ.1001 నుంచి రూ.10,000 వరకు రూ.2+జీఎస్టీ
రూ.10,001 నుంచి రూ. 25,000 వరకు రూ.4+జీఎస్టీ
రూ.25,001 నుంచి రూ.1,00,000 వరకు రూ.5+జీఎస్టీ
రూ.1,00,001 నుంచి రూ.2,00,000 వరకు రూ.12 + జీఎస్టీ
Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్మీ 7ఏ... ఎలా ఉందో చూడండి