SBI: ఎస్‌బీఐలో నవంబర్ 1 నుంచి మారనున్న వడ్డీ రేట్లు... వివరాలివే

State Bank of India Interest Rates | బ్యాంకు దగ్గర కావాల్సినంత లిక్విడిటీ ఉండటంతో ఈ వడ్డీ రేట్లు తగ్గించాలన్న నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: October 29, 2019, 1:04 PM IST
SBI: ఎస్‌బీఐలో నవంబర్ 1 నుంచి మారనున్న వడ్డీ రేట్లు... వివరాలివే
SBI: ఎస్‌బీఐలో నవంబర్ 1 నుంచి మారనున్న వడ్డీ రేట్లు... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI నవంబర్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలు చేయనుంది. ఎస్‌బీఐలో సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్లు ఉన్నవారిపై ప్రభావం చూపే నిర్ణయం ఇది. ఎస్‌బీఐ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తోంది. సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1 లక్ష వరకు ఉన్న డిపాజిట్లను 3.5 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గించనుంది. అంటే ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1 లక్ష పైన డిపాజిట్లు ఉన్న కస్టమర్లు నవంబర్ 1 నుంచి పావు శాతం తక్కువ వడ్డీని పొందనున్నారు. బ్యాంకు దగ్గర కావాల్సినంత లిక్విడిటీ ఉండటంతో ఈ వడ్డీ రేట్లు తగ్గించాలన్న నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- RBI వడ్డీ రెపో రేట్ తగ్గించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది ఎస్‌బీఐ.

ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతంగా ఉంది. దీంతో ఒకటి నుంచి రెండేళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5 శాతం ఉన్న వడ్డీని 6.4 శాతానికి తగ్గించింది ఎస్‌బీఐ. రూ.2 కోట్ల పైన ఉన్న డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది బ్యాంకు. గతంలో 1 నుంచి 2 ఏళ్లు రూ.2 కోట్ల పైన డిపాజిట్లు చేసిన వారికి 6.3 శాతం వడ్డీ ఇచ్చేది. కానీ ప్రస్తుతం 6 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది. నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త వడ్డీ రేట్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్, డిపాజిటర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ఓపెన్ చేసి చూడొచ్చు.

అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

November Holidays: బ్యాంకు పనులు ఉన్నాయా? నవంబర్‌లో సెలవుల వివరాలివే

Gold Sales: ఒక్క రోజులో 30,000 కిలోల బంగారం అమ్మకాలు... ధన్‌తేరస్ రోజున రికార్డ్
Loading...
Post Box App: మీ ఫోన్‌కు మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయా? ఈ ఒక్క యాప్‌తో చెక్ పెట్టొచ్చు
First published: October 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...