• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • STATE BANK OF INDIA SBI TO OFFER FAST TRACK TWO WHEELER LOANS TO CUSTOMERS VIA YONO APP SS

SBI Loan: ఎస్‌బీఐ యోనో యాప్‌లో వెంటనే లోన్లు

SBI Loan: ఎస్‌బీఐ యోనో యాప్‌లో వెంటనే లోన్లు (ప్రతీకాత్మక చిత్రం)

SBI Loan | మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా లోన్‌కు అప్లై చేస్తే రుణాలు త్వరగా మంజూరవుతాయి.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI యోనో పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా రుణాలను చాలా వేగంగా మంజూరు చేయనుంది ఎస్‌బీఐ. ఇప్పటికే టూవీలర్ లోన్లతో పాటు ఇతర రుణాలను మంజూరు చేస్తోంది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రీ అప్రూవ్డ్ రూ.21,000 కోట్ల పర్సనల్ లోన్లను మంజూరు చేసి రికార్డు సృష్టించింది. కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ, ఖర్చు చేసే తీరు, రీపేమెంట్ చేసే పద్ధతి లాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఈ రుణాలను మంజూరు చేసింది ఎస్‌బీఐ. యోనో ద్వారా ఒకరికి సగటున రూ.2,50,000 చొప్పున రుణాలు మంజూరు చేయడం విశేషం. పర్సనల్ లోన్ మాత్రమే కాదు... ఫాస్ట్ ట్రాక్ టూవీలర్ లోన్లను కూడా యోనో యాప్ ద్వారా తీసుకోవచ్చు. దీంతో పాటు ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పేరుతో భారీ స్థాయిలో రుణాలను కూడా ఇస్తోంది. యోనో యాప్ ద్వారా సులువుగా వాహన రుణాలు తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించొచ్చు.

    SBI Zero Balance Account: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయండిలా

    Postinfo: పోస్ట్ ఆఫీస్ సేవల కోసం ఈ యాప్... ఇలా వాడుకోండి


    యోనో యాప్ ద్వారా రుణాలు తీసుకోవడం మాత్రమే కాదు... ఏటీఎం కార్డు లేకుండా ఏటీఎం సెంటర్లల్లో నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. కొత్త కస్టమర్లు యోనో యాప్ ద్వారా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కార్ లోన్, హోమ్ లోన్లకు కూడా దరఖాస్తు చేయొచ్చు. యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా మరిన్ని రీటైల్ లోన్లు కూడా ఇవ్వాలని ఎస్‌బీఐ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం డిజిటల్ డాక్యుమెంటేషన్ ఎగ్జిక్యూషన్‌ను పరీక్షిస్తోంది ఎస్‌బీఐ. ఇందులో డిజిటల్ సంతకం కూడా ఉంటుంది. అంటే కస్టమర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా లోన్ తీసుకోవచ్చు. రూ.5,00,000 నుంచి రూ.10,00,000 వరకు కూడా పర్సనల్ లోన్ ఇవ్వనుంది ఎస్‌బీఐ.

    Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

    Online Banking: ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

    యోనో యాప్ ద్వారా ఎస్‌బీఐ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్ల గృహ రుణాలు, రూ.4,000 కోట్ల కార్ లోన్స్ మంజూరు చేయడం చేయడం విశేషం. నేరుగా బ్యాంకు ద్వారా జారీ చేసిన రుణాల మొత్తం రూ.10,000 కోట్లు.
    Published by:Santhosh Kumar S
    First published: