స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనలతో ఎస్‌బీఐ ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ఛార్జీలను పెంచుతోంది. అక్టోబర్‌లో ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది ఆర్‌బీఐ. అయితే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య జరిపే ఐఎంపీఎస్ లావాదేవీలకు ఛార్జీలు ఉంటాయని ఎస్‌బీఐ ప్రకటించింది. కస్టమర్లు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ.20 + జీఎస్‌టీ చెల్లించాలి. ఈ ఛార్జీలు 2022 ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. రూ.2 లక్షల లోపు ఐఎంపీఎస్ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఛార్జీలు ఉండవు.
ఒకప్పుడు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఐఎంపీఎస్ ద్వారా రియల్‌టైమ్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే టెక్నాలజీ వచ్చింది. ఐఎంపీఎస్ ద్వారా రోజులో ఎప్పుడైనా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో కూడా ఐఎంపీఎస్ సేవలు అందుబాటులో ఉంటాయి. దేశంలో ఎక్కడికైనా క్షణాల్లో డబ్బులు పంపొచ్చు. ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు ఐఎంపీఎస్ సేవల్ని అందిస్తున్నాయి.
LIC Premium: ఈపీఎఫ్ఓ డబ్బులతో ఎల్ఐసీ ప్రీమియం చెల్లించండి ఇలా
ఐఎంపీఎస్‌తో పాటు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ పద్ధతులు కూడా ఉన్నాయి. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్. నెఫ్ట్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే ఛార్జీలు ఉండవు. సెటిల్మెట్ పద్ధతి ద్వారా అవతలివారి అకౌంట్‌లోకి డబ్బులు వెళ్తాయి. గరిష్టంగా రూ.50,000 వరకు పంపొచ్చు. ఈ సర్వీస్ కూడా 24 గంటలు, 365 రోజులు అందుబాటులో ఉంటుంది.
Navi Mutual Fund: నావి నుంచి కొత్త మ్యూచువల్ ఫండ్... నెలకు రూ.500 పొదుపు చేస్తే చాలు
ఇక భారీ మొత్తంలో డబ్బులు పంపాలనుకుంటే ఆర్‌టీజీఎస్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఆర్‌టీజీఎస్ అంటే... రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఆర్‌టీజీఎస్ ద్వారా కనీసం రూ.2 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు. ఆర్‌టీజీఎస్ సర్వీస్ కూడా నిరంతరాయంగా అందుబాటులో ఉంటుంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ.25 చెల్లించాలి. రూ.5 లక్షలు దాటితే రూ.50 చెల్లించాలి.
ఇక యూపీఐ ద్వారా కూడా మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. యూపీఐ ద్వారా గరిష్టంగా రూ.1,00,000 మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇక యూపీఐ ద్వారా రోజూ 20 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయొచ్చు. యూపీఐ ట్రాన్స్‌ఫర్‌కు ఎలాంటి ఛార్జీలు ఉండవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Personal Finance, Sbi, State bank of india