SBI New Charges: ఎస్‌బీఐ మంత్లీ బ్యాలెన్స్, ఏటీఎం, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ఛార్జీల్లో మార్పు... కొత్త ఛార్జీలు ఇవే

SBI New Charges | మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ విషయానికి వస్తే మెట్రో, సెమీ-అర్బన్, రూరల్ బ్రాంచీలకు మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్-MAB వేర్వేరుగా ఉంటుంది.

news18-telugu
Updated: October 1, 2019, 4:37 PM IST
SBI New Charges: ఎస్‌బీఐ మంత్లీ బ్యాలెన్స్, ఏటీఎం, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ఛార్జీల్లో మార్పు... కొత్త ఛార్జీలు ఇవే
SBI New Charges: ఎస్‌బీఐ మంత్లీ బ్యాలెన్స్, ఏటీఎం, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ఛార్జీల్లో మార్పు... కొత్త ఛార్జీలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 1, 2019, 4:37 PM IST
మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా? ఎస్‌బీఐ కార్డులతో ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుంటారా? తరచూ ఎస్‌బీఐ ఏటీఎంలో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారా? ఏటీఎం విత్‌డ్రాయల్ ఛార్జీలను మార్చింది ఎస్‌బీఐ. అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి వచ్చాయి. ఎస్‌బీఐ కేటాయించిన ఉచిత లావాదేవీల కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే రూ.50+జీఎస్టీ చెల్లించక తప్పదు.ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5, ఏడాదికి 60 ట్రాన్సాక్షన్స్ ఉచితం. ఇతర బ్యాంక్ ఏటీఎంలల్లో నెలకు మెట్రోలో 3, ఇతర ప్రాంతాల్లో 5, ఏడాదికి మెట్రోలో 36, ఇతర ప్రాంతాల్లో 60 ట్రాన్సాక్షన్స్ ఉచితం. ఒకవేళ ట్రాన్సాక్షన్ డిక్లైన్ అయితే రూ.20, కార్డ్‌లెస్ క్యాష్ డిపాజిట్లకు రూ.22 చెల్లించాలి. ఇక మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ విషయానికి వస్తే మెట్రో, సెమీ-అర్బన్, రూరల్ బ్రాంచీలకు మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్-MAB వేర్వేరుగా ఉంటుంది.

SBI Monthly Average Balance Charges: అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఛార్జీల వివరాలు


అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకు బ్రాంచ్‌లో రూ.3,000 కనీసం అకౌంట్‌లో మెయింటైన్ చేయాలి.

మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 50 శాతం కన్నా తక్కువగా ఉంటే రూ.10+జీఎస్టీ.
మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 50 నుంచి 75 శాతం తక్కువగా ఉంటే రూ.12+జీఎస్టీ.
మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 75 శాతం మించి తక్కువగా ఉంటే రూ.15+జీఎస్టీ.


SBI Monthly Average Balance Charges: సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఛార్జీల వివరాలు

Loading...
సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకు బ్రాంచ్‌లో రూ.2,000 కనీసం అకౌంట్‌లో మెయింటైన్ చేయాలి.
మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 50 శాతం కన్నా తక్కువగా ఉంటే రూ.7.5+జీఎస్టీ.
మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 50 నుంచి 75 శాతం తక్కువగా ఉంటే రూ.10+జీఎస్టీ.
మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 75 శాతం మించి తక్కువగా ఉంటే రూ.12+జీఎస్టీ.

SBI Monthly Average Balance Charges: గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఛార్జీల వివరాలు


గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకు బ్రాంచ్‌లో రూ.1,000 కనీసం అకౌంట్‌లో మెయింటైన్ చేయాలి.
మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 50 శాతం కన్నా తక్కువగా ఉంటే రూ.5+జీఎస్టీ.
మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 50 నుంచి 75 శాతం తక్కువగా ఉంటే రూ.7.5+జీఎస్టీ.
మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 75 శాతం మించి తక్కువగా ఉంటే రూ.10+జీఎస్టీ.

ఇక రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS, నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ ట్రాన్స్‌ఫర్-NEFT ఛార్జీలు ఉచితం. అయితే బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ లావాదేవీలు జరిపితే ఛార్జీలు చెల్లించాలి. ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.

RTGS: రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆర్టీజీఎస్ లావాదేవీలకు రూ.20+జీఎస్టీ.
RTGS: రూ.5 లక్షలు మించితే రూ.40+జీఎస్టీ.
NEFT: రూ.10,000 వరకు రూ.2+జీఎస్టీ
NEFT: రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు రూ.4+జీఎస్టీ
NEFT: రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు రూ.12+జీఎస్టీ
NEFT: రూ.2,00,000 మించితే రూ.20+జీఎస్టీ.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Bank Timings: కస్టమర్లకు అలర్ట్... బ్యాంక్ టైమింగ్స్ మారాయి

Best TVs: ఆన్‌లైన్‌లో టీవీ కొంటున్నారా? ఫెస్టివల్ సేల్‌లో 12 బెస్ట్ టీవీలు ఇవే...

Smartphone: సెప్టెంబర్‌లో రిలీజైన కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... వీటిలో ఏది బెస్ట్? తెలుసుకోండి
First published: October 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...