స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొన్ని మెచ్యూరిటీ కాలాలకు వడ్డీ రేట్లను పెంచింది ఎస్బీఐ. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్స్ వడ్డీని పెంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లు 2021 జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారితో పాటు, ఇప్పటికే ఎఫ్డీ చేసినవారికి ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. చివరిసారిగా ఎస్బీఐ 2020 సెప్టెంబర్ 10న వడ్డీ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సవరించిన వడ్డీ రేట్లు చూస్తే 7 రోజుల నుంచి 45 రోజులకు 2.9 శాతం, 46 రోజుల నుంచి 179 రోజులకు 3.9 శాతం, 180 రోజుల నుంచి ఏడాది ఎఫ్డీపై 4.4 శాతం వడ్డీ వస్తుంది. ఎస్బీఐలో అన్ని కాలవ్యవధులకు బ్యాంకు ఎంత వడ్డీ చెల్లిస్తుందో తెలుసుకోండి.
SBI FD Rates: ఎస్బీఐలో ఎఫ్డీ వడ్డీ రేట్లు ఇవే...
7 రోజుల నుంచి 45 రోజులు- 2.9 శాతం
46 రోజుల నుంచి 179 రోజులు- 3.9 శాతం
180 రోజుల నుంచి 210 రోజులు- 4.4 శాతం
211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.4 శాతం
1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 5 శాతం
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.1 శాతం
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.3 శాతం
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 5.4 శాతం
Gold: బంగారు నగలు కొంటే పాన్ కార్డ్ ఇవ్వాలా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
Sovereign Gold Bond: రేపటి నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్ సేల్... బంగారం కొనడానికి ఇది కరెక్ట్ టైమా?
సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ అదనంగా వడ్డీ చెల్లిస్తోంది ఎస్బీఐ. అంటే అరశాతం వడ్డీ అదనంగా వస్తుంది. 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు అన్ని కాలవ్యవధులకు ఇది వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లు 3.4 శాతం నుంచి 6.2 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. సీనియర్ సిటిజన్లకు వేర్వేరు కాలవ్యవధులకు బ్యాంకు ఎంత వడ్డీ చెల్లిస్తుందో తెలుసుకోండి.
7 రోజుల నుంచి 45 రోజులు- 3.4 శాతం
46 రోజుల నుంచి 179 రోజులు- 4.4 శాతం
180 రోజుల నుంచి 210 రోజులు- 4.9 శాతం
211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.9 శాతం
1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 5.5 శాతం
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.6 శాతం
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.8 శాతం
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 6.2 శాతం
Jio New Plans: రోజూ 1.5జీబీ డేటా... రిలయెన్స్ జియో లేటెస్ట్ ప్లాన్స్ ఇవే
LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిందా? వెంటనే తీసుకోవచ్చు ఇలా
ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా అందిస్తున్న స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ 'ఎస్బీఐ వీకేర్' డిపాజిట్‌ను 2021 మార్చి 31 వరకు పొడిగించింది బ్యాంకు. ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లు 30 బేసిస్ పాయింట్స్ అదనంగా వడ్డీ లభిస్తుంది.