స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. కొత్త వడ్డీ రేట్లు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. టర్మ్ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్ పాయింట్స్, బల్క్ సెగ్మెంట్లో 25 నుంచి 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లను తగ్గించింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాలవ్యవధిని మినహాయించి అన్ని కాలవ్యవధులపై ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను తగ్గించింది బ్యాంకు.
జనవరిలోనే ఏడాది నుంచి రెండేళ్ల మధ్య మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏకంగా అరశాతం వడ్డీ రేటు తగ్గింది. దీంతో ఇప్పట్నుంచి 5 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక 180 నుంచి 210 రోజులు, 211 నుంచి ఏడాది లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో ఈ వడ్డీ 5.80 శాతంగా ఉండేది. ఏడాది నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్స్ వడ్డీ తగ్గించింది.
7 రోజుల నుంచి 45 రోజులు- 4.50%
46 రోజుల నుంచి 179 రోజులు- 5.00%
180 రోజుల నుంచి 210 రోజులు- 5.50%
211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 5.50%
1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 6.00%
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 6.00%
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 6.00%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 6.00%
సీనియర్ సిటిజన్లకు కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాలవ్యవధులపై అరశాతం వడ్డీ రేటు తగ్గింది. 7 నుంచి 45 రోజుల వరకు 5 శాతం వడ్డీ ఇవ్వనుంది. 46 రోజుల నుంచి 179 రోజుల వరకు 5.50 శాతం, 180 నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి 1 ఏడాది డిపాజిట్లకు 6%, ఒక ఏడాది నుంచి 10 ఏళ్ల మధ్య 6.50 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
7 రోజుల నుంచి 45 రోజులు- 5.00%
46 రోజుల నుంచి 179 రోజులు- 5.50%
180 రోజుల నుంచి 210 రోజులు- 6.00%
211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 6.00%
1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 6.50%
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 6.50%
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 6.50%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 6.50%
ఇవి కూడా చదవండి:
IRCTC Araku Tour: వాలెంటైన్స్ డేకి అరకు వెళ్తారా? తక్కువ బడ్జెట్లో ఐఆర్సీటీసీ ప్యాకేజీ
Prize Money: కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.1 కోటి గెలుచుకునే ఛాన్స్
ePAN Card: ఐదు నిమిషాల్లో ఇ-పాన్ కార్డు తీసుకోవచ్చు ఇలా