Home /News /business /

STATE BANK OF INDIA SBI RESTORES CASH WITHDRAWAL RULES FROM ATM AND BANK BRANCH FOR SAVINGS ACCOUNT HOLDERS SS

SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎస్‌బీఐ రూల్స్ ఇవే

SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎస్‌బీఐ రూల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎస్‌బీఐ రూల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

SBI cash withdrawal rules | లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో క్యాష్ విత్‌డ్రాయల్స్ విషయంలో పాత రూల్స్‌ని అమలు చేస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI.

    మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI సేవింగ్స్ అకౌంట్ ఉందా? బ్యాంకు బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేస్తుంటారా? ఉచితంగా డబ్బులు డ్రా చేసుకోవడానికి లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటితే ఛార్జీలు చెల్లించాలి. లాక్‌డౌన్ కారణంగా ఈ నియమనిబంధనల్లో కాస్త సడలింపులు ఇచ్చింది ఎస్‌బీఐ. కానీ లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో మళ్లీ పాత రూల్స్ అమలు చేస్తోంది. మరి బ్యాంకు బ్రాంచ్‌లో లేదా ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేస్తే ఏ రూల్స్ వర్తిస్తాయి? లిమిట్ దాటితే ఛార్జీలు ఎంత చెల్లించాలి? తెలుసుకోండి.

    Jio offer: జియో యూజర్లకు ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్... ప్లాన్స్ ఇవే

    అకౌంట్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.25,000 మెయింటైన్ చేస్తే 2 సార్లు, రూ.25,000 నుంచి రూ.50,000 మధ్య ఉంటే 10 సార్లు, రూ.50,000 నుంచి రూ.1,00,000 మధ్య ఉంటే 15 సార్లు బ్యాంకు బ్రాంచ్‌లో ఉచితంగా రెండు సార్లు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ లిమిట్ కన్నా ఎక్కువసార్లు బ్యాంకు బ్రాంచ్‌లో డబ్బులు డ్రా చేయాలంటే రూ.50+జీఎస్‌టీ చెల్లించాలి. రూ.1,00,000 కన్నా ఎక్కువ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఉంటే ఎన్నిసార్లైనా బ్యాంకు బ్రాంచ్‌లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఎస్‌బీఐ కస్టమర్లు ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అన్‌లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్‌తో సంబంధం లేదు.

    Gold Loan: ఆన్‌లైన్‌లో గోల్డ్ లోన్... ఇలా తీసుకోవచ్చు

    యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ పెరిగితే ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే లిమిట్ పెరుగుతుంది. అకౌంట్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.25,000 మెయింటైన్ చేస్తే 8 సార్లు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. మెట్రో నగరాల్లో 5 సార్లు ఎస్‌బీఐ ఏటీఎంలల్లో, 3 సార్లు ఇతర బ్యాంక్ ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. నాన్ మెట్రో నగరాల్లో మొత్తం 10సార్లు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంటే 5 సార్లు ఎస్‌బీఐ ఏటీఎంలల్లో, 5 సార్లు ఇతర బ్యాంక్ ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది.

    E-Aadhaar Card: ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయండి ఇలా

    రూ.25,000 నుంచి రూ.1,00,000 వరకు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఇతర బ్యాంక్ ఏటీఎంలల్లో 8 సార్లు (3 మెట్రో, 5 నాన్ మెట్రో) డబ్బులు డ్రా చేయొచ్చు. ఇక రూ.25,000 కన్నా ఎక్కువ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లు స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఏటీఎంలల్లో ఎన్నిసార్లైనా డబ్బులు తీసుకోవచ్చు. లిమిట్ దాటి ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే రూ.10 నుంచి రూ.20+ జీఎస్‌టీ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: ATM, Bank, Bank account, Banking, Sbi, State bank of india

    తదుపరి వార్తలు