SBI Good News: నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ఛార్జీలు తొలగించిన ఎస్‌బీఐ

SBI Good News | ఇక మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే NEFT, RTGS ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

news18-telugu
Updated: July 3, 2019, 4:33 PM IST
SBI Good News: నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ఛార్జీలు తొలగించిన ఎస్‌బీఐ
SBI Good News: నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ఛార్జీలు తొలగించిన ఎస్‌బీఐ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 3, 2019, 4:33 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు శుభవార్త. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు ఇక ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఛార్జీలను తొలగించాలని కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. దీంతో ఇకపై ఈ ఛార్జీలను కస్టమర్లు కాకుండా బ్యాంకులే భరించాలి. ఆర్‌బీఐ ఆదేశాలతో ఇప్పటికే కొన్ని బ్యాంకులు నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ఛార్జీలను తొలగించాయి. ఇప్పుడు ఎస్‌బీఐ కూడా ఛార్జీలను ఎత్తేసింది. ఇక మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే NEFT, RTGS ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసినా సరే ఛార్జీలు ఉండవు. గతంలో నెఫ్ట్ ట్రాన్సాక్షన్లకు రూ.10,000 వరకు రూ.2.50, రూ.1 లక్ష వరకు రూ.5, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15, రూ.2 లక్షల కన్నా ఎక్కువైతే రూ.25 చొప్పున ఛార్జీలు వసూలు చేసింది ఎస్‌బీఐ. ఇక ఆర్‌టీజీఎస్‌లో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రూ.25 ఛార్జీలు ఉండేవి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-IMPS ఛార్జీలు మాత్రం అలాగే ఉన్నాయి. వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఖాతాదారులు ఎక్కువగా ఐఎంపీఎస్ ఉపయోగించుకుంటారు. ఈ ఛార్జీలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఐఎంపీఎస్ ద్వారా మీరు గరిష్టంగా రూ.2 లక్షల వరకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. రాత్రి 10.45 నుంచి 11.45 మధ్య ఐఎంపీఎస్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ కావు. మీరు ఒకవేళ ఆ సమయంలో మనీ ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత అకౌంట్‌లో జమ అవుతాయి. ఐఎంపీఎస్ సేవలకు ఎలాంటి సెలవులు వర్తించవు. నెఫ్ట్ సేవలు బ్యాచ్‌ల వారీగా కొనసాగుతుంటాయి. శనివారాలతో కలిపి అన్ని పనిదినాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మొత్తం 23 సెటిల్మెంట్స్ జరుగుతాయి. మీరు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల లోపు నెఫ్ట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే అదే రోజు డబ్బులు జమ అవుతాయి. సాయంత్రం 6.30 గంటల నుంచి 7 గంటల మధ్య నెఫ్ట్‌లో మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే అదే రోజు లేదా మరుసటి రోజు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఎస్‌బీఐ నెఫ్ట్ ద్వారా గరిష్టంగా రూ.10 లక్షల వరకు డబ్బులు పంపొచ్చు. ఆర్‌టీజీఎస్ ద్వారా కనీసం రూ.2 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి




ఇవి కూడా చదవండి:

Insurance: ఎవరూ క్లెయిమ్ చేసుకోని డబ్బు రూ.16,887 కోట్లు... అందులో మీదెంత?

SBI Home Loan: ఎస్‌బీఐ నుంచి రెండు రకాల హోమ్ లోన్స్... వివరాలివే
Loading...
IRCTC-Aadhaar Link: ఐఆర్‌సీటీసీతో ఆధార్ లింక్ చేస్తే లాభమిదే...
First published: July 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...