SBI Home Loan: ఎస్‌బీఐలో తగ్గిన హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు... ఇవాళ్టి నుంచి కొత్త వడ్డీ

ఎంసీఎల్ఆర్ తగ్గడంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి. హోమ్ లోన్ వడ్డీ రేటు 7.90 శాతానికి తగ్గింది. ఇప్పటికే హోమ్ లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐలు తగ్గుతాయి.

news18-telugu
Updated: February 10, 2020, 3:40 PM IST
SBI Home Loan: ఎస్‌బీఐలో తగ్గిన హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు... ఇవాళ్టి నుంచి కొత్త వడ్డీ
SBI Home Loan: ఎస్‌బీఐ నుంచి కస్టమర్లకు గుడ్ న్యూస్... హోమ్ లోన్ వడ్డీ రేట్ల తగ్గింపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఇవాళ్టి నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI మానెటరీ పాలసీ సమావేశం జరిగిన మరుసటి రోజే ఎస్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్-MCLR అన్ని కాల వ్యవధులపై 5 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి వస్తాయి. రేట్లను సవరించిన తర్వాత ఏడాది ఎంసీఎల్ఆర్ ఏడాదికి 7.90 శాతం నుంచి 7.85 శాతానికి తగ్గింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎంసీఎల్ఆర్ వరుసగా 9వ సారి తగ్గించడం విశేషం.

SBI Home Loan interest rates, State Bank of India Home Loan interest rates, SBI Home Loan rates, State Bank of India Home Loan rates, SBI latest Home Loan rates, ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు
Source: SBI

ఎస్‌బీఐ కొత్త ఎంసీఎల్ఆర్ ఈ విధంగా ఉంది...



ఓవర్ నైట్- 7.60%
ఒక నెల- 7.60%


మూడు నెలలు- 7.65%
ఆరు నెలలు- 7.80%ఒక ఏడాది- 7.85%
రెండేళ్లు- 8.05%
మూడేళ్లు- 8.15%

ఎంసీఎల్ఆర్ తగ్గడంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి. హోమ్ లోన్ వడ్డీ రేటు 7.90 శాతానికి తగ్గింది. ఇప్పటికే హోమ్ లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐలు తగ్గుతాయి. ఇకపై హోమ్ లోన్ తీసుకునేవారికి కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. గురువారం ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశంలో రెపో రేట్‌ను యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

ePAN Card: ఐదు నిమిషాల్లో ఇ-పాన్ కార్డు తీసుకోవచ్చు ఇలా

Prize Money: కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.1 కోటి గెలుచుకునే ఛాన్స్

Digital Cash: ఈ టిప్స్‌తో మీ పేటీఎం, ఫోన్‌ పేలో డబ్బులు సేఫ్
First published: February 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు