టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత బ్యాంకు పనుల కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం రావట్లేదు. ఆన్‌లైన్‌లోనే చాలావరకు పనులు చేసుకోవచ్చు. కొన్ని సేవలకు మాత్రమే బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు బ్యాంకులు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల్ని ప్రారంభించాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి రావడంతో బ్యాంకులు కొత్తగా ఈ సేవల్ని ప్రారంభిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులకు, ఇళ్లలోంచి బయటకు వెళ్లలేకపోతున్నవారికి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉపయోగకరం. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్- PNB, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI, బ్యాంక్ ఆఫ్ బరోడా- BOB, బ్యాంక్ ఆఫ్ ఇండియా- BOI, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- IOB, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నాయి.
Aadhaar PVC Card: ఏటీఎం కార్డు సైజులో ఆధార్ కార్డ్... ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోండి ఇలా
EPFO Benefits: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ 4 ప్రయోజనాలు మిస్ కావొద్దు
డోర్‌స్టెప్ బ్యాంకింగ్‌లో ఏఏ సేవలు పొందొచ్చు?
డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా అనేక సేవల్ని అందిస్తున్నాయి బ్యాంకులు. ఇందులో నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్కువ. కస్టమర్ల నుంచి ఏవైనా డాక్యుమెంట్స్ తీసుకొని సంబంధిత బ్రాంచ్‌లో ఇవ్వడం, చెక్ సేకరణ, క్లియరెన్స్ సర్వీసెస్, కొత్త చెక్ బుక్ కోసం రిక్వెస్ట్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ రిక్వెస్ట్, ఐటీ, జీఎస్‌టీ చలాన్, జీవన్ ప్రమాన్ యాప్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ లాంటి సేవలు లభిస్తాయి. ఇక డెలివరీ సర్వీసెస్‌లో భాగంగా టర్మ్ డిపాజిట్ అడ్వైజ్, అకౌంట్ స్టేట్‌మెంట్, టీడీఎస్, ఫామ్ 16 సర్టిఫికెట్, గిఫ్ట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్, డిమాండ్ డ్రాఫ్ట్, పే ఆర్డర్ లాంటి సేవలు లభిస్తాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో భాగంగా డిపాజిట్ కోసం క్యాష్ పికప్, విత్‌డ్రాయల్ చేస్తే క్యాష్ డెలివరీ సేవలుంటాయి. కనీసం రూ.1,000 డిపాజిట్ చేయాలి లేదా విత్‌డ్రా చేయాలి. గరిష్టంగా రూ.10,000 వరకే చేయొచ్చు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్-AePS లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఈ ఆర్థిక సేవలు పొందొచ్చు.
Gold Price Today: ఈరోజు బంగారం రేట్ ఎంత? ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే తెలుస్తుంది
SBI ATM PIN: ఏటీఎం కార్డ్ పిన్ మర్చిపోయారా? ఒక్క కాల్‌తో కొత్త పిన్ జనరేట్ చేయొచ్చు
డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు ఎలా పొందాలి?
బ్యాంకు కస్టమర్లు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు పొందాలంటే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌లో రిజిస్టర్ చేసిన తర్వాత అకౌంట్ నెంబర్, పిన్ నెంబర్ ఎంటర్ చేసి సేవలు పొందొచ్చు. యాప్‌లో బ్యాంక్ పేరు, కస్టమర్ పేరు, అకౌంట్ టైప్, బ్రాంచ్ పేరు లాంటి వివరాలు ఉంటాయి. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ కోసం రిక్వెస్ట్ చేసినప్పుడు వివరాలన్నీ సరిగ్గా చూసుకోవాలి. సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ గుర్తుంచుకోవాలి. అందులో ఏజెంట్ పేరు, పికప్ అడ్రస్, టైమ్ స్లాట్ లాంటి వివరాలుంటాయి. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు పొందాలంటే ఛార్జీలు చెల్లించాలి. ఎస్‌బీఐ కస్టమర్ల నుంచి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలకు ప్రతీసారి రూ.75+జీఎశ్‌టీ వసూలు చేస్తోంది. ఈ ఛార్జీలు కస్టమర్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి.