SBI: ఇవాళ ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం... ఎందుకంటే

SBI | మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తారా? ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల్ని పొందుతుంటారా? ఎస్‌బీఐ ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలగనుంది.

news18-telugu
Updated: June 21, 2020, 9:07 AM IST
SBI: ఇవాళ ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం... ఎందుకంటే
SBI: ఇవాళ ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం... ఎందుకంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఖాతాదారులకు అలర్ట్. జూన్ 21న అంటే ఇవాళ ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఉంటుందని బ్యాంకు ప్రకటించింది. ఈ రోజు ఎస్‌బీఐ ఆన్‌లైన్ అప్లికేషన్స్‌లో కొన్ని మార్పులు చేస్తున్నామని, ఫలితంగా ఆన్‌లైన్ సేవల్లో కొన్ని అంతరాయాలు కలగొచ్చని తెలిపింది. ఖాతాదారులు అందుకు అనుగుణంగా తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని బ్యాంకు సూచిస్తోంది. ఒకవేళ మీరు ఇవాళ ఏవైనా ముఖ్యమైన లావాదేవీలు జరపాల్సి ఉన్నట్టైతే ముందుగానే ఆ ట్రాన్సాక్షన్ప్ ప్లాన్ చేయండి.



నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇంటి నుంచే బ్యాంకింగ్ సేవల్ని పొందేలా కస్టమర్లను ప్రోత్సహిస్తోంది. #GharSeBanking ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అందులో భాగంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ మరింత సులభతరం చేసేందుకు మార్పుచేర్పులు చేస్తోంది. కస్టమర్లకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ విషయంలో అవగాహన కల్పిస్తోంది. కస్టమర్లు ఆన్‌లైన్ ద్వారా వీలైనన్ని సేవలు పొందేలా ప్రోత్సహిస్తోంది. ఫండ్స్ ట్రాన్స్‌ఫర్, బిల్ పేమెంట్స్, డిపాజిట్ అకౌంట్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ పొందడం, చెక్ బుక్స్ ఆర్డర్ చేయడం లాంటి సేవలన్నీ ఆన్‌లైన్‌‌లో పొందొచ్చు.

ఇవి కూడా చదవండి:SBI: క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఎస్‌బీఐ వార్నింగ్ ఇదే

Pension Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000 వరకు పెన్షన్

Samsung Smart TV: సాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌టీవీలు వచ్చేశాయి... ధర రూ.14,490 నుంచి

Nokia 5310: నోకియా నుంచి మరో ఫీచర్ ఫోన్... ధర రూ.3,399 మాత్రమే
First published: June 21, 2020, 9:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading