SBI Scheme: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఈ స్కీమ్ గడువు పెంపు

SBI Scheme: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఈ స్కీమ్ గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)

SBI Wecare Deposit scheme | ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్ స్కీమ్ గడువును 2021 జూన్ 30 వరకు పొడిగించింది. ఈ స్కీమ్‌తో లాభాలేంటో తెలుసుకోండి.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు శుభవార్త. వృద్ధులకు స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ 'ఎస్‌బీఐ వీకేర్' గడువును జూన్ 30 వరకు పొడిగించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధుల కోసం ప్రత్యేకంగా టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను 2020 మేలో ప్రకటించింది బ్యాంకు. మొదట సెప్టెంబర్ వరకు గడువు విధించింది. తర్వాత డిసెంబర్ వరకు ఓసారి, 2021 మార్చి 31 వరకు మరోసారి గడువును పొడిగించింది. ఈ గడువు ముగుస్తుండటంతో మరోసారి మూడు నెలలు గడువు పొడిగించింది. కాబట్టి సీనియర్ సిటిజన్లు 'ఎస్‌బీఐ వీకేర్' స్కీమ్‌లో డిపాజిట్ చేయడానికి మరో మూడు నెలలు అవకాశం ఉంది. 'ఎస్‌బీఐ వీకేర్' ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌. సాధారణంగా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు వృద్ధులకు వేరుగా ఉంటాయి. సాధారణ వడ్డీ రేట్ల కన్నా వృద్ధులకు 50 బేసిస్ పాయింట్స్ అంటే అర శాతం వడ్డీ ఎక్కువ లభిస్తుంది.

    Mineral Water: మినరల్ వాటర్ కొంటున్నారా? ఏప్రిల్ 1 నుంచి బాటిల్‌పై ఈ గుర్తు తప్పనిసరి

    April Bank Holidays: ఏప్రిల్‌లో ముఖ్యమైన లావాదేవీలున్నాయా? బ్యాంకులకు 12 రోజులు సెలవులు

    ప్రస్తుతం సాధారణ ప్రజలకు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 5.40 శాతం వడ్డీని ఇస్తోంది ఎస్‌బీఐ. వృద్ధులకు 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువ వడ్డీ చెల్లిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం వడ్డీ వస్తుంది. ఒకవేళ 'ఎస్‌బీఐ వీకేర్' స్కీమ్‌లో డిపాజిట్ చేస్తే అదనంగా 30 బేసిస్ పాయింట్స్ వడ్డీ లభిస్తుంది. అంటే 'ఎస్‌బీఐ వీకేర్' స్కీమ్‌లో డిపాజిట్ ద్వారా సీనియర్ సిటిజన్లు 6.20 శాతం వడ్డీ పొందొచ్చు. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. అది కూడా 2021 జూన్ 30 లోగా ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వడ్డీ రేట్లను తరచూ మారుస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అందుకే ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను చెక్ చేయాలి.

    New Rules in April: ఏప్రిల్‌లో అమల్లోకి వస్తున్న 12 కొత్త రూల్స్ ఇవే... మీపై ప్రభావం ఎంతంటే

    Aadhaar Card Address Update: అడ్రస్ ప్రూఫ్ లేదా? అయినా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చండి ఇలా

    'ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌‌లో డిపాజిట్ చేయాలంటే వయస్సు 60 ఏళ్ల పైనే ఉండాలి. భార్యాభర్తలు సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నామినేషన్ సదుపాయం కూడా ఉంది. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.15,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. మొదట ఐదేళ్లకు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఐదేళ్ల కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేస్తే వడ్డీ నష్టపోవాల్సి ఉంటుంది. 0.30 శాతం వడ్డీ తక్కువగా వస్తుంది. అప్పుడు సాధారణంగా సీనియర్ సిటిజన్లకు వర్తించే వడ్డీ రేట్లే వర్తిస్తాయి. ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీపై ఎలాంటి ఆదాయపు పన్ను మినహాయింపులు ఉండవు.
    Published by:Santhosh Kumar S
    First published: