SBI Loans: ఎస్‌బీఐ ఇచ్చే లోన్స్ ఇవే... వడ్డీ రేట్లు తెలుసుకోండి

SBI Loans | సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఉపయోగపడేది హోమ్ లోన్. చాలామంది హోమ్ లోన్ తీసుకొనే ఇంటిని కొంటుంటారు. హోమ్ లోన్‌పై 8.65% నుంచి 9.30% మధ్య వడ్డీ వసూలు చేస్తుంది బ్యాంకు.

news18-telugu
Updated: May 11, 2019, 1:26 PM IST
SBI Loans: ఎస్‌బీఐ ఇచ్చే లోన్స్ ఇవే... వడ్డీ రేట్లు తెలుసుకోండి
SBI Loans: ఎస్‌బీఐ ఇచ్చే లోన్స్ ఇవే... వడ్డీ రేట్లు తెలుసుకోండి
  • Share this:
మీరు లోన్ తీసుకున్నారా? తీసుకోవాలని అనుకుంటున్నారా? జీవితంలో అందరికీ ఏదో ఓ దశలో లోన్ అవసరం. ఉంటుంది అప్పు లేకుండా ఎవరి జీవితం గడవదు. గతంలో బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం కాస్త కష్టంగా ఉండేది. ఇప్పుడు బ్యాంకుల్లో లోన్ తీసుకునే పద్ధతి సులభతరమైంది. మినిమమ్ డాక్యుమెంట్స్ ఉంటే చాలు లోన్ సులువుగా వచ్చేస్తుంది. మరి మీరూ ఏదైనా లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా? ఎస్‌బీఐ పలు రకాల లోన్స్‌ని కస్టమర్స్‌కి ఆఫర్ చేస్తోంది. పర్సనల్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్, హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఆటో లోన్స్... ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎలాంటి లోన్ అయినా తీసుకోవచ్చు. మరి ఏ లోన్‌పై వడ్డీ ఎంత? ఎవరెవరికి వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి? తెలుసుకోండి.

పర్సనల్ లోన్పర్సనల్ లోన్ గురించి అందరికీ తెలిసిందే. అన్ని బ్యాంకులూ పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్సనల్ లోన్ తీసుకుంటే వార్షికంగా 12.50% నుంచి 15.50% మధ్య వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. డిఫెన్స్, పారామిలిటరీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగులకు 12% నుంచి 13% మధ్య వడ్డీ ఉంటుంది. గరిష్టంగా రూ.15 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. రీపేమెంట్ గడువు ఐదేళ్లు.

Read this: Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... వివరాలివే

State Bank of India loans, SBI types of loans, SBI personal loans, SBI home loans, SBI auto loans, SBI education loans, SBI Property loans, SBI gold Loans, sbi loans, Sbi loans app, SBI loan calculator, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ లోన్స్, ఎస్‌బీఐ రుణాలు, ఎస్‌బీఐ పర్సనల్ లోన్స్, ఎస్‌బీఐ ఆటో లోన్స్, ఎస్‌బీఐ ఎడ్యుకేషన్ లోన్స్, ఎస్‌బీఐ గోల్డ్ లోన్స్
ప్రతీకాత్మక చిత్రం

ఆటో లోన్


వాహనాలు కొనేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆటో లోన్స్ ఆఫర్ చేస్తోంది. 9.25% నుంచి 10.75% మధ్య వడ్డీ రేట్లు ఉంటాయి. కాల వ్యవధి ఏడేళ్లు. ఇటీవలే 'గ్రీన్ కార్ లోన్ స్కీమ్' ప్రకటించింది ఎస్‌బీఐ. ఈ స్కీమ్‌లో లోన్ తీసుకుంటే వడ్డీ 20 బేసిస్ పాయింట్స్ తగ్గుతుంది. అంతేకాదు... రీపేమెంట్ కాల వ్యవధి 8 ఏళ్లుగా ఉంటుంది. 'గ్రీన్ కార్ లోన్ స్కీమ్'లో మొదటి ఆరు నెలల్లో లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికే ఈ స్కీమ్ వర్తిస్తుంది.

హోమ్ లోన్


సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఉపయోగపడేది హోమ్ లోన్. చాలామంది హోమ్ లోన్ తీసుకొనే ఇంటిని కొంటుంటారు. హోమ్ లోన్‌పై 8.65% నుంచి 9.30% మధ్య వడ్డీ వసూలు చేస్తుంది బ్యాంకు. మహిళలకు 8.60% నుంచి 9.20% వడ్డీ ఛార్జ్ చేస్తుంది ఎస్‌బీఐ. దరఖాస్తుదారులు, ఎంచుకున్న కాలవ్యవధి, ప్రాపర్టీ ఎలాంటిది అన్న దానిపై వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.

Read this: Aadhaar Card: మీ ఆధార్ కార్డు ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోండి

State Bank of India loans, SBI types of loans, SBI personal loans, SBI home loans, SBI auto loans, SBI education loans, SBI Property loans, SBI gold Loans, sbi loans, Sbi loans app, SBI loan calculator, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ లోన్స్, ఎస్‌బీఐ రుణాలు, ఎస్‌బీఐ పర్సనల్ లోన్స్, ఎస్‌బీఐ ఆటో లోన్స్, ఎస్‌బీఐ ఎడ్యుకేషన్ లోన్స్, ఎస్‌బీఐ గోల్డ్ లోన్స్
ప్రతీకాత్మక చిత్రం

గోల్డ్ లోన్


మీ దగ్గరున్న బంగారాన్ని తాకట్టుపెట్టి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. కనీసం రూ.20 వేలు, గరిష్టంగా రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్ ఇస్తుంది ఎస్‌బీఐ. ఒక ఏడాది MCLR పైన 2% అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రీపేమెంట్ కోసం గరిష్టంగా 30 నెలలు ఎంచుకోవచ్చు.

ఎడ్యుకేషన్ లోన్


ఉన్నత చదువులు చదవాలంటే కాస్త ఎక్కువ ఖర్చవుతుంది. ఇక విదేశాల్లో చదువుకోవాలంటే భారీగానే డబ్బు ఖర్చు చేయాలి. ప్రతిభ ఉన్నా డబ్బులు లేక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతుంటారు. వారికోసం బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్స్ ఆఫర్ చేస్తుంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే 8.70% నుంచి 10.75% మధ్య వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అమ్మాయిలకు వడ్డీ రేటుపై 0.50% తగ్గింపు లభిస్తుంది.

ప్రాపర్టీపై లోన్


మీకు ఉన్న ప్రాపర్టీపై లోన్ తీసుకోవచ్చు. ఏడాది MCLR పైన 1.45% నుంచి 3% అదనంగా వడ్డీ చెల్లించాలి.

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3

ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డులో తప్పుల్ని సరిచేసుకోండి ఇలా...

JIO New Plans: జియో ప్లాన్స్ ధరలు తగ్గాయి... రూ.149 ప్లాన్‌తో 42 జీబీ డేటా

Jio Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ జియో యాప్స్ ఉన్నాయా? ఉపయోగాలు తెలుసుకోండి
Published by: Santhosh Kumar S
First published: May 11, 2019, 1:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading