హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Offer: ఎస్‌బీఐలో ఆ అకౌంట్ ఉన్నవారికి రూ.2,00,000 ఉచిత ఇన్స్యూరెన్స్

SBI Offer: ఎస్‌బీఐలో ఆ అకౌంట్ ఉన్నవారికి రూ.2,00,000 ఉచిత ఇన్స్యూరెన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SBI Jan Dhan Account | మీకు ఎస్‌బీఐలో జన్ ధన్ అకౌంట్ ఉందా? రూ.2,00,000 ఉచిత ఇన్స్యూరెన్స్ అందిస్తుంది ఎస్‌బీఐ. పూర్తి వివరాలు తెలుసుకోండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఖాతాదారులకు శుభవార్త. ఎస్‌బీఐలో జన్ ధన్ అకౌంట్ ఉన్నవారు రూ.2,00,000 ఉచిత ప్రమాద బీమా పొందొచ్చు. అయితే రూపే డెబిట్ కార్డ్స్ ఉపయోగించేవారికే ఈ బీమా వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన-PMJDY పథకాన్ని ప్రారంభించింది. ఎస్‌బీఐలో జన్ ధన్ అకౌంట్ ఉన్నవారికి రూ.2,00,000 ఉచిత ప్రమాద బీమా సదుపాయం ఉంది. ఎస్‌బీఐలో అన్ని డెబిట్ కార్డులకు కాంప్లిమెంటరీ సర్వీసెస్ ఉంటాయి. యాక్సిడెంటల్ డెత్ ఇన్స్యూరెన్స్, పర్చేస్ ప్రొటెక్షన్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అందులో భాగంగా రూపే డెబిట్ కార్డు ఉపయోగించే జన్ ధన్ అకౌంట్ హోల్డర్లకు రూ.2 లక్షల ప్రమాద బీమాను ఆఫర్ చేస్తోంది ఎస్‌బీఐ.

నిరుపేదలు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు కూడా బ్యాంకింగ్ సేవలు పొందేందుకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. తక్కువ ఛార్జీలతో ఆర్థిక సేవలు, బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్, ఇన్స్యూరెన్స్, పెన్షన్ లాంటివి పొందేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. జన్ ధన్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో కూడా ఓపెన్ చేయొచ్చు. కేవైసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు ఆ అకౌంట్‌ని జన్ ధన్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు.

Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి కారణాలు ఇవే

LIC Policy: మీ జీతంలో కొంత పొదుపు చేయండి... మెచ్యూరిటీ తర్వాత రూ.70 లక్షలు మీవే

జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేసినవారికి రూపే PMJDY డెబిట్ కార్డు వస్తుంది. 2018 ఆగస్ట్ 28 నాటికి జన్ ధన్ అకౌంట్స్ ఓపెన్ చేసినవారికి రూ.1,00,000ప్రమాద బీమా వర్తిస్తుంది. 2018 ఆగస్ట్ 28 తర్వాత జన్ ధన్ ఖాతా తెరిచినవారికి రూ.2,00,000 ప్రమాద బీమా వర్తిస్తుంది. అయితే ప్రమాదం జరగానికి 90 రోజుల ముందు రూపే డెబిట్ కార్డుతో ఫైనాన్షియల్ లేదా నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తేనే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది.

SBI Alert: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? జూన్ 30 లోగా ఈ పనిచేయండి

SBI Alert: కస్టమర్లకు అలర్ట్... రెండు గంటలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో సేవలు బంద్


భారతదేశంలోనే కాదు... ఇతర దేశాల్లో ప్రమాదాల కారణంగా జన్ ధన్ అకౌంట్ హోల్డర్ మరణిస్తే ఇన్స్యూరెన్స్‌ను నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ కోసం క్లెయిమ్ ఫామ్, డెత్ సర్టిఫికెట్, ప్రమాదం జరిగినట్టు ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్, ఆధార్ కార్డ్ వివరాలు సబ్మిట్ చేయాలి. వీటితో పాటు బ్యాంకు నుంచి డిక్లరేషన్ కూడా కావాలి. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన 10 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ అవుతుంది.

First published:

Tags: Bank account, BANK ACCOUNTS, Bank news, Banking, Jan dhan account, Jan dhan yojana, Personal Finance, Pradhan Mantri Jan Dhan Yojana, State bank of india

ఉత్తమ కథలు