ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా? బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? కరోనా వైరస్ సంక్షోభం కారణంగా లోన్ ప్రాసెస్ ఇప్పుడు ఆలస్యం అవుతుందని అనుకుంటున్నారా? కేవలం 4 క్లిక్స్‌తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI పర్సనల్ లోన్ ప్రాసెస్‌ను సులభతరం చేసింది. ఎస్‌బీఐ యోనో యాప్‌లో కేవలం 4 క్లిక్స్‌తో ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ మంజూరు చేస్తోంది ఎస్‌బీఐ. ప్రీ-అప్రూవ్డ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు తక్కువ. లోన్ ప్రాసెస్ కూడా వేగంగా జరుగుతుంది. ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. అయితే ఈ లోన్లను ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఇస్తోంది ఎస్‌బీఐ. మరి మీరు కూడా ఆ కస్టమర్ల జాబితాలో ఉన్నారో లేదో ఎలిజిబిలిటీ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు బ్యాంకు సూచించిన నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.
SBI Personal Loan: ఎస్‌బీఐలో ప్రీ-అప్రూవ్డ్ లోన్ ప్రాసెస్ ఇదే...
ఎస్‌బీఐ ప్రీ-అప్రూవ్డ్ లోన్‌కు మీరు అర్హులో కాదో తెలుసుకోవడానికి PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ అకౌంట్ నెంబర్‌లోని చివరి 4 అంకెలు టైప్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. ఉదాహరణకు మీ అకౌంట్ చివర్లో 1234 అని ఉంటే PAPL 1234 అని టైప్ చేయాలి. ఒకవేళ మీరు ప్రీ-అప్రూవ్డ్ లోన్‌కు అర్హులు అయితే యోనో వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ కావాలి. Avail Now పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత టెన్యూర్, అమౌంట్ సెలెక్ట్ చేయాలి. చివరగా ఓటీపీ ఎంటర్ చేయాలి. మీ అకౌంట్‌లోకి లోన్ అమౌంట్ వచ్చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.