SBI Gold Loan: స్మార్ట్‌ఫోన్‌లో ఎస్‌బీఐ గోల్డ్ లోన్... తీసుకోండి ఇలా

SBI Gold Loan: స్మార్ట్‌ఫోన్‌లో ఎస్‌బీఐ గోల్డ్ లోన్... తీసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Gold Loan | గోల్డ్ లోన్ తీసుకునే విధానాన్ని మరింత సులభతరం చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. స్మార్ట్‌ఫోన్‌లో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు ఇలా.

  • Share this:
    మీరు బంగారంపై రుణాలు తీసుకోవాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI గోల్డ్ లోన్ ప్రాసెస్‌ను చాలా సులభతరం చేసింది. యోనో యాప్ ఉంటే కేవలం 4 స్టెప్స్‌లో గోల్డ్ లోన్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది. మీరు తక్కువ ప్రాసెస్‌తో గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో yono SBI యాప్ డౌన్‌లోడ్ చేయండి. యాప్‌లో మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత మొదటి స్టెప్‌లో Gold Loan ఆప్షన్ పైన క్లిక్ చేసి Apply Now ట్యాబ్ పైన క్లిక్ చేయండి. మీరు తాకట్టు పెట్టాలనుకుంటున్న నగల వివరాలు తెలపండి. మూడో స్టెప్‌లో గోల్డ్ లోన్ స్కీమ్, మీకు కావాల్సిన అప్పు, కాలవ్యవధి లాంటి వివరాలు సెలెక్ట్ చేయండి. నాలుగో స్టెప్‌లో బ్రాంచ్ సెలెక్ట్ చేయండి. చివరగా ఓసారి మీ వివరాలు సరిచూసుకొని సబ్మిట్ చేయండి. మీ నగలు, కేవైసీ డాక్యుమెంట్స్ తీసుకొని సంబంధిత బ్రాంచ్‌కు వెళ్తి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.


    కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అన్ని వర్గాల వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పట్లేదు. అందుకే గోల్డ్ లోన్ సులువుగా దొరుకుతుందని బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకులు కూడా బంగారంపై రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఆఫర్ చేస్తోంది. పేపర్ వర్క్ తగ్గించి సులువుగా బంగారంపై రుణాలు ఇస్తోంది. ఎస్‌బీఐలో బంగారంపై రూ.20,000 నుంచి రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. బంగారం విలువలో గరిష్టంగా 75 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. బంగారంపై రుణం ఇచ్చేముందు నాణ్యతతో పాటు తూకం కూడా చెక్ చేస్తారు. తీసుకునే రుణంపై 0.50% శాతం+జీఎస్‌టీ ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాలి. అంటే రూ.1,00,000 రుణం తీసుకుంటే రూ.500+జీఎస్‌టీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ప్రస్తుతం 7.50% వడ్డీ రేటుకే గోల్డ్ లోన్స్ ఇస్తోంది ఎస్‌బీఐ.

    ఇవి కూడా చదవండి:

    Flipkart Sale: రూ.52,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.21,999 ధరకే... అదిరిపోయిన ఆఫర్

    Smartphones: చైనా బ్రాండ్లు వద్దా? అయితే మీ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    Credit Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత? పేటీఎంలో ఫ్రీగా ఒక్క నిమిషంలో తెలుసుకోండి
    First published: