ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చినా వెంటనే గుర్తొచ్చేది బంగారమే. ఇంట్లో బంగారం ఉంటే నగదు ఉన్నట్టే. బంగారాన్ని నగదుగా మార్చుకోవడం చాలా సులువు. అన్నీ పక్కాగా ఉంటే గంటలో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు సులువుగా డబ్బులు పొందే మార్గం గోల్డ్ లోనే. బ్యాంకులతో పాటు అనేక సంస్థలో గోల్డ్ లోన్స్ ఇస్తుంటాయి. అయితే వడ్డీ రేట్లు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఇస్తోంది. బంగారు నగలతో పాటు గోల్డ్ కాయిన్స్ తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. పేపర్ వర్క్ తక్కువ. వడ్డీ రేటు కూడా తక్కువే.
ఎస్బీఐలో బంగారంపై రూ.20,000 నుంచి రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. బంగారం విలువలో గరిష్టంగా 75 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. బంగారంపై రుణం ఇచ్చేముందు నాణ్యతతో పాటు తూకం కూడా చెక్ చేస్తారు. తీసుకునే రుణంపై 0.50% శాతం+జీఎస్టీ ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాలి. అంటే రూ.1,00,000 రుణం తీసుకుంటే రూ.500+జీఎస్టీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ప్రస్తుతం 7.75% వడ్డీ రేటుకే గోల్డ్ లోన్స్ ఇస్తోంది ఎస్బీఐ. ఇటీవల కెనెరా బ్యాంకు 7.85% వడ్డీకి గోల్డ్ లోన్ స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
Online Gold: ఆన్లైన్లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి
EMI moratorium: ఆరు నెలల మారటోరియంతో రూ.6 లక్షల నష్టం... ఎలాగంటే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Silver rates