SBI Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... డబ్బులు లేకపోయినా షాపింగ్ చేయొచ్చు ఇలా

SBI Debit Card EMI | మీరు డెబిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్‌తో వస్తువులు కొనాలనుకుంటే మీ సేవింగ్స్ అకౌంట్‌లో బ్యాలెన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఫైనాన్షియల్, క్రెడిట్ హిస్టరీ బాగున్న కస్టమర్లు మాత్రమే ఈ స్కీమ్‌కు అర్హులు.

news18-telugu
Updated: October 8, 2019, 3:44 PM IST
SBI Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... డబ్బులు లేకపోయినా షాపింగ్ చేయొచ్చు ఇలా
SBI Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... డబ్బులు లేకపోయినా షాపింగ్ చేయొచ్చు ఇలా (image: SBI)
  • Share this:
మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI డెబిట్ కార్డ్ ఉందా? ఇక మీరు డెబిట్ కార్డ్ పైనా ఈఎంఐ సదుపాయం పొందొచ్చు. దసరా, దీపావళి పండుగ సీజన్ సందర్భంగా 'డెబిట్ కార్డ్ ఈఎంఐ ఫెసిలిటీ' పేరుతో ఈ స్కీమ్ ప్రారంభించింది ఎస్‌బీఐ. ప్రస్తుతం ఎస్‌బీఐ కార్డ్ ఉన్న కస్టమర్లు డెబిట్ కార్ట్ ఈఎంఐ సదుపాయం పొందొచ్చు. 6 నెలల నుంచి 18 నెలల వరకు ఈఎంఐ ఎంచుకోవచ్చు. ఈ సదుపాయం పొందేందుకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్లు కూడా సబ్మిట్ చేయక్కర్లేదు. బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేదు. మీరు షాపింగ్ చేసి పీఓఎస్‌లో మీ డెబిట్ కార్డుతో స్వైప్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ ఎంచుకోవచ్చు. మీకు ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో ఒక్క ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. SMS DCEMI అని టైప్ చేసి 567676 నెంబర్‌కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ నుంచి ఎస్ఎంఎస్ పంపాలి. మీ ఎలిజిబిలిటీ ఎంతో రిప్లై వస్తుంది.



షాపింగ్ సమయంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా మర్చంట్ స్టోర్స్‌లో డెబిట్ కార్డులతో స్వైప్ చేసి తమకు కావాల్సిన వస్తువుల్ని ఈఎంఐ ఆప్షన్‌తో కొనుక్కోవచ్చు. దేశంలోని 1500 పైగా పట్టణాల్లో, 40000 పైగా మర్చంట్స్ దగ్గర ఉత్పత్తులు కొనొచ్చు. పైన్ ల్యాబ్స్ పీఓఎస్ మెషీన్లు ఉన్న స్టోర్లల్లో ఈఎంఐ సదుపాయం ఎంచుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డుతో బిల్ పేమెంట్ చేసే సమయంలో కస్టమర్లు 6 నెలల నుంచి 18 నెలల టెన్యూర్ ఎంచుకోవాలి.
రజనీష్ కుమార్, ఎస్‌బీఐ ఛైర్మన్
మీరు డెబిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్‌తో వస్తువులు కొనాలనుకుంటే మీ సేవింగ్స్ అకౌంట్‌లో బ్యాలెన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఫైనాన్షియల్, క్రెడిట్ హిస్టరీ బాగున్న కస్టమర్లు మాత్రమే ఈ స్కీమ్‌కు అర్హులు. ట్రాన్సాక్షన్ పూర్తైన తర్వాతి నెల నుంచి ఇన్‌స్టాల్‌మెంట్ మొదలవుతుంది. సో... ఈ పండుగ సీజన్‌లో ఇంట్లోకి కొత్త వస్తువులు కొనాలనుకునే ఎస్‌బీఐ కస్టమర్లు... ఇక డబ్బులు లేవని ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డ్ ఉంటే చాలు... ఈఎంఐ ఆప్షన్‌తో షాపింగ్ చేయొచ్చు.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Post Office RD: మీకు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ గురించి తెలుసా? లాభాలు ఇవే

Tejas Express: రైలు టికెట్ కొంటే ఇంట్లో వస్తువులకూ ఇన్స్యూరెన్స్

Aadhaar: ఆధార్ అప్‌డేట్ చేయించాలా? ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేయొచ్చు ఇలా
Published by: Santhosh Kumar S
First published: October 8, 2019, 3:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading