SBI: ఎస్‌బీఐ గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా లోన్స్

State Bank of India | ఎస్‌బీఐ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన వెబ్‌సైట్ లేదా YONO ద్వారా రుణాలకు దరఖాస్తు చేసేవారికి వడ్డీ రేటులో పావు శాతం తగ్గుతుంది.

news18-telugu
Updated: August 20, 2019, 3:58 PM IST
SBI: ఎస్‌బీఐ గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా లోన్స్
SBI: ఎస్‌బీఐ గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా లోన్స్
news18-telugu
Updated: August 20, 2019, 3:58 PM IST
మీరు హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లాంటి రుణాలు ఏవైనా తీసుకోవాలని అనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మంచి ఆఫర్లు ప్రకటించింది. కొన్ని లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు తొలగించడంతో పాటు వడ్డీ రేట్లనూ తగ్గించింది. పండుగ సీజన్ వస్తుండటంతో కస్టమర్లను ఆకర్షించేందుకు ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఫెస్టివల్ సీజన్‌లో తీసుకునే కార్ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు లేదు. అంతేకాదు... వడ్డీ రేట్లు అతి తక్కువగా 8.70% నుంచి ప్రారంభమౌతాయి. ఇక ఎస్‌బీఐ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన వెబ్‌సైట్ లేదా YONO ద్వారా రుణాలకు దరఖాస్తు చేసేవారికి వడ్డీ రేటులో పావు శాతం తగ్గుతుంది. ఉద్యోగులకు కారు ఆన్ రోడ్ ధరలో 90% వరకు లోన్ లభిస్తుంది. కార్ల అమ్మకాలు తగ్గడంతో ఆటోమొబైల్ డీలర్లకు లోన్ రీపేమెంట్ కోసం 15 నుంచి 30 రోజుల వరకు గడువు ఇచ్చింది ఎస్‌బీఐ.





2019 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు హోమ్ లోన్సపై 35 బేసిస్ పాయింట్స్ వడ్డీ తగ్గించింది ఎస్‌బీఐ. 8.05% వడ్డీకే ఆర్‌బీఐ రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్‌ను ఆఫర్ చేస్తోంది ఎస్‌బీఐ. సెప్టెంబర్ 1 నుంచి తీసుకునే హోమ్ లోన్స్‌కు ఇది వర్తిస్తుంది.ఇక పర్సనల్ లోన్ విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.20 లక్షల వరకు రుణాలను 10.75% వడ్డీకే ఇవ్వనుంది. లోన్ కాలవ్యవధిని ఆరేళ్ల వరకు ఎంచుకోవచ్చు. ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉన్న కస్టమర్లు యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.5 లక్షల వరకు ప్రీ-అప్రూవ్డ్ డిజిటల్ లోన్స్ తీసుకోవచ్చు. భారతదేశంలో చదివే విద్యార్థులకు 8.25% వడ్డీకే రూ.50 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తోంది ఎస్‌బీఐ. విదేశాల్లో చదివే వారైతే రూ.1.50 కోట్ల వరకు లోన్ పొందొచ్చు. 15 ఏళ్లలో రీపేమెంట్ చేయాలి.
Loading...
Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

SBI: ఏటీఎం కార్డుల్ని తొలగించే ఆలోచనలో ఎస్‌బీఐ... డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసా?

Paytm: మీ ఫోన్‌లో పేటీఎం యాప్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న కంపెనీ

Jio GigaFiber: జియో గిగాఫైబర్ కనెక్షన్‌తో టీవీ ఉచితం... రిజిస్టర్ చేసుకోండి ఇలా
First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...