SBI: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ... మళ్లీ ప్రాసెసింగ్ ఫీజు వసూలు

SBI loans | ఎస్‌బీఐలో ప్రాసెసింగ్ ఫీజు 0.4 శాతం ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా రుణాలు తీసుకునేవారు రూ.10,000 నుంచి రూ.30,000 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. బిల్డర్లు రూ.5,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

news18-telugu
Updated: October 11, 2019, 12:39 PM IST
SBI: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ... మళ్లీ ప్రాసెసింగ్ ఫీజు వసూలు
SBI: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ... మళ్లీ ప్రాసెసింగ్ ఫీజు వసూలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 11, 2019, 12:39 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు ఇది షాకింగ్ న్యూస్. హోమ్ లోన్స్, టాప్ అప్ లోన్స్, కార్పొరేట్, బిల్డర్ లోన్స్ తీసుకునేవారి నుంచి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసే ఆలోచనలో ఎస్‌బీఐ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. వాస్తవానికి పండుగ సీజన్ సందర్భంగా డిసెంబర్ 31 వరకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఎత్తేస్తున్నట్టు ఎస్‌బీఐ గతంలో ప్రకటించింది. కానీ ఆ ఆఫర్‌ను ఎస్‌బీఐ ఉపసంహరించుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గతంగా సర్క్యులర్‌ జారీ అయినట్టు వార్తలొస్తున్నాయి. అక్టోబర్ 15 నుంచి మళ్లీ ప్రాసెసింగ్ ఫీజు అమలులోకి వచ్చే అవకాశముంది. ఎస్‌బీఐలో ప్రాసెసింగ్ ఫీజు 0.4 శాతం ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా రుణాలు తీసుకునేవారు రూ.10,000 నుంచి రూ.30,000 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. బిల్డర్లు రూ.5,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే రెపో రేట్ తగ్గించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లు తగ్గించింది. అయితే వడ్డీ రేటు తగ్గించి ప్రాసెసింగ్ ఫీజును అమలు చేయడం కస్టమర్లకు చేదువార్తే. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మళ్లీ అమలు చేయడం మాత్రమే కాదు... ప్రీపేమెంట్ ఛార్జీలు, సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యురటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పెంచే అవకాశం ఉంది.

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Pension Scheme: కేంద్రం నుంచి రూ.3,000 పెన్షన్... అర్హతలు ఇవే

Card Lost: మీ క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డు పోయిందా? ఇలా చేయండి
Loading...
Credit Card Limit: క్రెడిట్ కార్డు ఉందా? లిమిట్ ఎప్పుడు పెంచుకోవాలో తెలుసా?
First published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...