మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకున్నారా? పర్సనల్ లోన్ తీసుకొని ఈఎంఐలు చెల్లిస్తున్నారా? ఎస్బీఐ లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్లాట్‌ఫామ్ కూడా ఏర్పాటు చేసింది. మరి మీ లోన్ పునర్నిర్మించుకోవడానికి, మీ ఈఎంఐ భారం తగ్గించడానికి ఉండాల్సిన అర్హతల గురించి తెలుసుకోండి. రీటైల్ కస్టమర్లు 1 నెల నుంచి 24 నెలల మారటోరియం ఎంచుకోవచ్చు. హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్లకు ఇది వర్తిస్తుంది. ఇతర కస్టమర్ల కన్నా 0.35% శాతం అదనంగా ఛార్జీలు వసూలు చేస్తుంది ఎస్బీఐ. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 24 చివరి తేదీ. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఇక లోన్ రీస్ట్రక్చరింగ్‌కు అప్లై చేసేవారు 2020 మార్చి 1 కన్నా ముందు లోన్ తీసుకున్నవారై ఉండాలి. 2020 మార్చి 1 తర్వాత రుణాలు తీసుకుంటే రుణాల పునర్నిర్మాణం సాధ్యం కాదు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మీ ఆదాయంపై లేకపోతే మీరు ఎప్పట్లాగే ఈఎంఐలు చెల్లించాలి. లోన్ రీస్ట్రక్చరింగ్ కోసం https://sbi.co.in/ వెబ్సైట్లోనే దరఖాస్తు చేయాలి. కేవలం https://sbi.co.in/ వెబ్సైట్లోనే దరఖాస్తు చేయాలి. SBI Loan Finance Ltd లేదా Mudra Finance Pvt. Ltd పేర్లతో ఎవరైనా సంప్రదిస్తే వారిని నమ్మొద్దని హెచ్చరిస్తోంది ఎస్బీఐ.
CIBIL Score: లోన్ కావాలా? ముందు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి
PF Balance: తెలుగులో మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి ఇలా
మీ లోన్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. provisional eligibility అని ఉంటే మీరు రుణ పునర్నిర్మాణానికి అర్హులు. అప్పుడు మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొని సంబంధిత బ్రాంచ్‌లో సంప్రదించాలి. అయితే మీకు మారటోరియం ఇవ్వాలా వద్దా అన్న తుది నిర్ణయం బ్యాంకుదే. 7 నుంచి 10 వర్కింగ్ డేస్‌లో మీ దరఖాస్తు ప్రాసెస్ అవుతుంది. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ ఫిబ్రవరి సాలరీ స్లిప్, లేటెస్ట్ సాలరీ స్లిప్, ఉద్యోగం కోల్పోతే అందుకు సంబంధించిన డాక్యుమెంట్ ఉండాలి. అంటే 2020 ఫిబ్రవరితో పోలిస్తే 2020 ఆగస్ట్ నాటికి మీ వేతనం లేదా ఆదాయం తగ్గితే, వ్యాపారాలు మూతపడితే, అందుకు కరోనా వైరస్ మహమ్మారి కారణం అయితే మీరు మీ రుణాలను పునర్నిర్మించుకోవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు తాము కోవిడ్ 19 కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు డిక్లరేషన్ ఇవ్వాలి.
Gold Loan Vs Personal Loan: లోన్ తీసుకునే ముందు ఈ లెక్కలు మర్చిపోవద్దు
SBI ATM: అలర్ట్... ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు కొత్త రూల్
మీకు ఎన్ని లోన్ అకౌంట్లు ఉంటే వాటిపై మారటోరియం ఎంచుకోవచ్చు. మీరు గరిష్టంగా 24 నెలలు అంటే రెండేళ్లు మారటోరియం ఎంచుకోవచ్చు. గతంలో బ్యాంకులు ఇచ్చిన 6 నెలల మారటోరియం కన్నా ఇది అదనం. మారటోరియం కాలంలో మీరు ఎలాంటి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మారటోరియం సందర్భంలో వడ్డీ కూడా లెక్కిస్తుంది బ్యాంకు. ఒకవేళ మారటోరియం కాలంలో మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఈఎంఐలు చెల్లించి వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. మీరు మారటోరియం ఎంచుకుంటారు కాబట్టి ఈఎంఐలో మార్పు ఉంటుంది. మారటోరియం కాలాన్ని లెక్కించి బ్యాంకు ఈఎంఐను నిర్ణయిస్తుంది. మీరు మారటోరియం ఎంచుకుంటే ఇతర రుణాలకు అప్లై చేయడానికి అవకాశం ఉండదు.
Published by:Santhosh Kumar S
First published:September 22, 2020, 12:07 IST