SBI Kisan credit card: ఎస్‌బీఐ అకౌంట్ ఉన్న రైతులకు గుడ్ న్యూస్... కొత్తగా మరో ఫీచర్

SBI Kisan credit card | కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్న రైతుల కోసం యోనో కృషి ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మరో కొత్త సర్వీస్ ప్రారంభించింది.

news18-telugu
Updated: August 17, 2020, 6:31 PM IST
SBI Kisan credit card: ఎస్‌బీఐ అకౌంట్ ఉన్న రైతులకు గుడ్ న్యూస్... కొత్తగా మరో ఫీచర్
SBI Kisan credit card: ఎస్‌బీఐ అకౌంట్ ఉన్న రైతులకు గుడ్ న్యూస్... కొత్తగా మరో ఫీచర్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI రైతుల కోసం మరో కొత్త ఫీచర్ ప్రారంభించింది. యోనో కృషి ప్లాట్‌ఫామ్‌పై కిసాన్ క్రెడిట్ కార్డ్ రివ్యూ లేదా కేసీసీ రివ్యూ ఆప్షన్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా రైతులు తమ క్రెడిట్ కార్డ్ లిమిట్ తెలుసుకోవడానికి బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం స్మార్ట్‌ఫోన్‌లో యోనో యాప్‌లో నాలుగు క్లిక్స్‌తో క్రెడిట్ కార్డ్ లిమిట్ తెలుసుకోవచ్చు. గతంలో అయితే కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ తెలుసుకోవడానికి రైతులు బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ సంక్షోభ కాలంలో బ్యాంకులకు డిజిటల్ సేవలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది ఎస్‌బీఐ. అందులో భాగంగా యోనో కృషి ప్లాట్‌ఫామ్‌పై కిసాన్ క్రెడిట్ కార్డ్ రివ్యూ ఫీచర్‌ను ప్రారంభించింది.

ఎస్‌బీఐలో అకౌంట్లు ఉన్న రైతుల కోసం యోనో కృషి ప్లాట్‌ఫామ్‌లో యోనో కేసీసీ రివ్యూ ప్రారంభించడం మరో ప్రయత్నం. డిజిటల్ ఆవిష్కరణల ద్వారా వారి వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నాం. లక్షలాది మంది రైతుల భద్రత, సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఫీచర్ ప్రారంభించాం. కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను మార్చుకోవడానికి ఎలాంటి సమస్యలు లేని ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.

రజనీష్ కుమార్, ఎస్‌బీఐ ఛైర్మన్


ఎస్‍బీఐలో కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్న 75 లక్షల మందికి యోనో కృషి ప్లాట్‌ఫామ్‌లో కిసాన్ క్రెడిట్ కార్డ్ రివ్యూ ఆప్షన్ ఉపయోగపడుతుందని బ్యాంకు చెబుతోంది. దీని వల్ల రైతుల సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు ప్రాసెస్ వేగంగా పూర్తవుతుందని ఎస్‌బీఐ వెల్లడించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్న రైతులు తమ క్రెడిట్ లిమిట్ తెలుసుకోవడానికి యోనో కృషి ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేస్తే చాలు. అందులో కేవలం నాలుగు క్లిక్స్‌తో క్రెడిట్ లిమిట్ తెలుస్తుంది. ఈ ప్రాసెస్‌లో ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు. అయితే రైతులు అందరి దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉండవు కాబట్టి కేసీసీ రివ్యూ ప్రాసెస్‌ను బ్యాంక్ బ్రాంచ్‌లల్లో కూడా కొనసాగిస్తోంది ఎస్‌బీఐ.

యోనో కృషి ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన ఏడాదిలోనే 14 లక్షల అగ్రి గోల్డ్ లోన్స్ మంజూరు చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. యోనో కృషి ప్లాట్‌ఫామ్‌పై యోనో ఖాతా, యోనో బచత్, యోనో మిత్ర, యోనో మండి లాంటి రకరకాల సేవలు రైతులకు లభిస్తాయి.
Published by: Santhosh Kumar S
First published: August 17, 2020, 6:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading