మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? ఏటీఎం కార్డ్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? షాపింగ్ కోసం డెబిట్ కార్డ్ ఎక్కువగా వాడుతుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో కలిసి కోబ్రాండెడ్ కాంటాక్ట్‌లెస్ రూపే డెబిట్ కార్డ్ లాంఛ్ చేసింది. సాధారణంగా అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతీ ఒక్కరికీ డెబిట్ కార్డ్ కమ్ ఏటీఎం కార్డుల్ని ఇస్తుంటుంది ఎస్బీఐ. వాటిలో ఫీచర్స్ కాస్త తక్కువగా ఉంటాయి. అందుకే కస్టమర్లు తమ డెబిట్ కార్డుల్ని అప్‌గ్రేడ్ చేస్తుంటారు. ఇలా డెబిట్ కార్డ్ అప్‌గ్రేడ్ చేసేవారిని దృష్టిలో పెట్టుకొని వారి అవసరాలకు తగ్గట్టుగా కాంటాక్ట్‌లెస్ రూపే డెబిట్ కార్డ్ రూపొందించింది ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లు అందరూ దేశంలోని ఏ ఎస్బీఐ బ్రాంచ్‌లో అయినా ఈ డెబిట్ కార్డ్ తీసుకోవచ్చు.
Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ చేశారు? 2 నిమిషాల్లో తెలుసుకోండిలా
EPF Money: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభ కాలంలో సోషల్ డిస్టెన్సింగ్ ఎక్కువగా పాటిస్తున్నారు. కొత్త ప్రదేశాల్లో వస్తువుల్ని తాకాలన్నా ఆలోచిస్తున్నారు. షాపింగ్ సమయంలో కార్డు స్వైప్ చేయడానికి వెనకాడుతున్నారు. ఇలాంటి భయాలను కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ దూరం చేస్తుంది. అంటే కార్డు స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా పేమెంట్ చేయొచ్చు. జస్ట్ పాయింట్ ఆఫ్ సేల్-POS మెషీన్పైన కార్డు ట్యాప్ చేస్తే చాలు పేమెంట్ జరిగిపోతుంది. గతంలో రూ.2,000 వరకు మాత్రమే ఇలా పేమెంట్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రూ.5,000 వరకు కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్‌కు అనుమతి ఇచ్చింది. ఎస్బీఐ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో కలిసి రూపొందించిన రూపే డెబిట్ కార్డుతో కూడా రూ.5,000 వరకు కాంటాక్ట్‌లెస్ పేమెంట్ చేయొచ్చు.
Aadhaar PVC Card: పాన్ కార్డ్ సైజులో ఆధార్ కార్డ్... సింపుల్‌గా ఆర్డర్ చేయండి ఇలా
Paytm Instant Personal Loan: 2 నిమిషాల్లో రూ.2,00,000 లోన్... పేటీఎం యూజర్లకు మాత్రమే
మరి ఎస్బీఐలో రకరకాల కార్డులు ఉండగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-IOC డెబిట్ కార్డ్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటన్న అనుమానం రావొచ్చు. ఇతర కార్డులకు ఉన్నట్టుగానే ఈ కార్డుతో పేమెంట్స్ చేసినా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ ఫ్యూయెల్ స్టేషన్స్‌లో మీకు ఫ్యూయెల్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు పేమెంట్ చేసిన మొత్తంలో 0.75 శాతం లాయల్టీ పాయింట్స్ వస్తాయి. ప్రతీ రూ.200 పేమెంట్‌పై మూడు రెట్లు రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఒక నెలలో ఎంతైనా పేమెంట్ చేయొచ్చు. లిమిట్ లేదు. తర్వాత ఈ రివార్డ్ పాయింట్స్‌ని రీడీమ్ చేసుకోవచ్చు. దీంతో పాటు డైనింగ్, మూవీస్, బిల్ పేమెంట్స్ పైనా రివార్డ్స్ లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:January 09, 2021, 11:56 IST