SBI: గుడ్ న్యూస్... వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు ఏటీఎం మీ ఇంటికి వస్తుంది

SBI launches doorstep ATM service | మీరు డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్తున్నారా? మీరు కోరుకుంటే ఏటీఎం మీ ఇంటికి వస్తుంది. ఎలాగో తెలుసుకోండి.

news18-telugu
Updated: August 24, 2020, 11:27 AM IST
SBI: గుడ్ న్యూస్... వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు ఏటీఎం మీ ఇంటికి వస్తుంది
SBI: గుడ్ న్యూస్... వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు ఏటీఎం మీ ఇంటికి వస్తుంది (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు శుభవార్త. ఇకపై మీరు డబ్బులు డ్రా చేయాలంటే ఏటీఎం సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు ఏటీఎం మీ ఇంటికి వస్తుంది. ఇది అక్షరాలా నిజం. కస్టమర్ల కోసం డోర్ స్టెప్ ఏటీఎం సర్వీస్ ప్రారంభించింది ఎస్‌బీఐ. కస్టమర్లు వాట్సప్‌లో మెసేజ్ చేసినా లేదా కాల్ చేసినా మీరు కోరుకున్న ప్రాంతానికి ఏటీఎంను పంపిస్తుంది ఎస్‌బీఐ. ఎస్‌బీఐ కస్టమర్లు 7052911911 లేదా 7760529264 నెంబర్లకు కాల్ లేదా ఎస్ఎంఎస్ చేయాలి. కస్టమర్లు కోరుకున్న సమయానికి ఏటీఎం ఇంటికి వస్తుంది. అయితే ప్రస్తుతం ఎస్‌బీఐ డోర్‌స్టెప్ ఏటీఎం సర్వీస్ లక్నోలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే సర్వీస్ ప్రారంభం కానుంది.


ఎస్‌బీఐ ఇప్పటికే 'డోర్‌స్టెప్ బ్యాంకింగ్' సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. 70 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, దివ్యాంగులు, ఇంటికే పరిమితమైన రోగులు, అంధుల కోసం ఈ సర్వీస్ అందిస్తోంది. నగదు డ్రా చేయడానికి, నగదు జమ చేయడానికి, చెక్, ఫామ్ 15హెచ్, కేవైసీ డాక్యుమెంట్, టర్మ్ డిపాజిట్ అడ్వైజ్, లైఫ్ సర్టిఫికెట్ లాంటివి బ్యాంకులో సబ్మిట్ చేయడానికి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ట్రాన్సాక్షన్స్‌కు ఛార్జీలు వసూలు చేస్తుంది ఎస్‌బీఐ. అయితే కొన్ని బ్యాంకుల్లోనే 'డోర్‌స్టెప్ బ్యాంకింగ్' సేవలు లభిస్తాయి. అది కూడా బ్యాంకుకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లు మాత్రమే 'డోర్‌స్టెప్ బ్యాంకింగ్' సేవల్ని ఉపయోగించుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: August 24, 2020, 11:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading