• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • STATE BANK OF INDIA SBI IS IMPLEMENTING NEW RULES FROM MAY 1 KNOW WHAT RULES CHANGED ON REPO RATE LINKAGE INTEREST RATES DEPOSITS SS

SBI New Rules: మే 1 నుంచి కొత్త రూల్స్... ఎస్‌బీఐలో మారే నిబంధనలు ఇవే

SBI New Rules: మే 1 నుంచి కొత్త రూల్స్... ఎస్‌బీఐలో మారే నిబంధనలు ఇవే

SBI New Rules from May 1 | ఎప్పుడు రెపో రేట్ తగ్గినా ఖాతాదారులకు ఈఎంఐ భారం తగ్గుతుంది. ఈ నిబంధన మే 1 నుంచి అమలులోకి రానుంది. రూ.1 లక్ష కన్నా ఎక్కువ రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

  • Share this:
    మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా? ఎస్‌బీఐ బ్యాంకుల్లో లావాదేవీలు ఎక్కువగా చేస్తుంటారా? అయితే మే 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉంటే ఈ నిబంధనల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. మే 1 నుంచి లోన్లు, డిపాజిట్ రేట్లు మారనున్నాయి. ఎస్‌బీఐలో లోన్లపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఇవి కాకుండా మే 1 నుంచి మారబోయే నిబంధనలు ఏంటీ? అవి మీకు ఎంత వరకు ఉపయోగకరం? తెలుసుకోండి.

    రూ.1 లక్ష కన్నా ఎక్కువ డిపాజిట్లకు తగ్గనున్న వడ్డీ


    కొత్త నిబంధనల ప్రకారం మే 1 నుంచి డిపాజిట్లపై వడ్డీ రేట్లు మారనున్నాయి. ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవాళ్లు రూ.1 లక్ష కన్నా ఎక్కువ డిపాజిట్లపై తక్కువ వడ్డీ పొందుతారు. 0.25-0.75 శాతం మధ్య వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది. అంటే మే 1 నుంచి రూ.1 లక్ష వరకు డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ లభిస్తోంది. అంతకన్నా ఎక్కువ డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీ ఇవ్వనుంది ఎస్‌బీఐ.

    Read this: ATM: కార్డు లేకపోయినా ఏటీఎంలో డబ్బులు డ్రా... చేసుకోవచ్చు ఇలా

    State Bank of India, SBI new rules, SBI new rules on deposits interest rates, SBI new rules on repo rate linkage, SBI new rules on interest rates, SBI new rules from may 1, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ కొత్త నిబంధనలు, ఎస్‌బీఐ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్, ఎస్‌బీఐ వడ్డీ రేట్లు, ఎస్‌బీఐ రెపో రేట్ లింకేజ్, ఎస్‌బీఐ కొత్త వడ్డీ రేట్లు
    ప్రతీకాత్మక చిత్రం

    రెపో రేట్ లింకేజ్


    బ్యాంకులు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్ లెండింగ్ రేట్(MCLR) ఆధారంగా రుణాలపై వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంటాయి. చాలావరకు బ్యాంకులు రెపో రేట్ తగ్గినా ఆ లాభాన్ని కస్టమర్లకు చేరనివ్వవు. అయితే రెపో రేట్‌ను లోన్ ఇంట్రెస్ట్ రేట్‌కు లింక్ చేస్తే ఆ లాభం కస్టమర్లకు చేరుతుంది. ఇప్పుడు ఎస్‌బీఐ అలాగే లోన్ వడ్డీ రేటుకు రెపో రేట్‌ను లింక్ చేయబోతోంది. ఇకపై ఎప్పుడు రెపో రేట్ తగ్గినా ఖాతాదారులకు ఈఎంఐ భారం తగ్గుతుంది. ఈ నిబంధన మే 1 నుంచి అమలులోకి రానుంది. రూ.1 లక్ష కన్నా ఎక్కువ రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

    తగ్గనున్న వడ్డీ రేట్లు


    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేట్లు తగ్గించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తోంది. రూ.30 లక్షల వరకు హోమ్ లోన్స్‌పై 0.10 శాతం వడ్డీ రేటు తగ్గనుంది. కొత్త వడ్డీ రేట్లు మే 1 నుంచి అమలులోకి వస్తాయి.

    Photos: అదిరిపోయిన ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్

    ఇవి కూడా చదవండి:

    WhatsApp IPL Stickers: వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

    Jio Effect: ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్స్

    Amazon Pay: ఇక అమెజాన్ పే నుంచి మనీ ట్రాన్స్‌ఫర్... ఇలా చేయొచ్చు

     
    First published: