స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఖాతాదారులకు బ్యాంకు షాకిచ్చింది. లాకర్ ఛార్జీలను భారీగా పెంచేసింది. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ బ్యాంకుల్లోని స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ల ఛార్జీలను పెంచింది ఎస్‌బీఐ. అన్ని కేటగిరీల్లో రూ.500 నుంచి రూ.3000 వరకు లాకర్ ఛార్జీలను పెంచింది ఎస్‌బీఐ. ఇకపై లాకర్ కావాలంటే మెట్రో, అర్బన్‌లో కనీసం రూ.2,000, సెమీ అర్బన్, రూరల్‌లో కనీసం రూ.1,500 చెల్లించాలి. ఒకవేళ పెద్ద లాకర్ కావాలంటే రూ.12,000 వరకు చెల్లించాల్సిందే. వన్ టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.500+జీఎస్‌టీ వసూలు చేయనుంది ఎస్‌బీఐ. ఒకవేళ లాకర్ రెంట్ ఛార్జీలు గడువు లోగా చెల్లించకపోతే అదనంగా 40% పెనాల్టీ చెల్లించాలి. కొత్త ఛార్జీలు 2020 మార్చి 31 నుంచి అమలులోకి వస్తాయని ఎస్‌బీఐ అధికారికంగా ప్రకటించింది.
మెట్రో, అర్బన్‌లో స్మాల్ లాకర్‌కు గతంలో రూ.1,500 ఉంటే ఇకపై రూ.2,000 చెల్లించాలి. మీడియం లాకర్ ఛార్జీలు రూ.3,000 నుంచి రూ.4,000 చేసింది బ్యాంకు. లార్జ్ లాకర్‌కు రూ.6,000 ఉంటే మార్చి 31 నుంచి రూ.8,000 చెల్లించాలి. ఇక ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్‌పై రూ.3,000 ఛార్జీలు పెరిగాయి. ప్రస్తుతం రూ.9,000 ఉంటే కొత్త ఛార్జీల ప్రకారం రూ.12,000 చెల్లించాలి. ఇక సెమీ అర్బన్, రూరల్‌లో చిన్న లాకర్‌కు ప్రస్తుతం రూ.1,000 ఉంటే ఇకపై రూ.1,500 చెల్లించాలి. మీడియం లాకర్ ఛార్జీలు రూ.2,000 నుంచి రూ.3,000 చేసింది బ్యాంకు. లార్జ్ లాకర్ ఛార్జీలు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు పెరగడం విశేషం. ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్‌కు అదనంగా రూ.2,000 చెల్లించాలి. ప్రస్తుతం రూ.7,000 ఛార్జీలు ఉంటే మార్చి 31 నుంచి రూ.9,000 చెల్లించాలి. ఈ ఛార్జీలపై జీఎస్‌టీ అదనం.
భారతదేశంలో బ్యాంకులన్నీ లాకర్ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. అయితే లాకర్ ఫెసిలిటీ కోసం కస్టమర్లు ఛార్జీలు చెల్లించాలి. కస్టమర్లు తమ విలువైన వస్తువులు భద్రపర్చుకోవడానికి వేర్వేరు సైజుల్లో లాకర్స్ అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగతంగా, జాయింట్‌గా, సంస్థలు, ట్రస్టులు లాకర్స్ తీసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ డాక్యుమెంట్స్‌తో పాటు ఫోటోగ్రాఫ్ తప్పనిసరి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI నిబంధనల ప్రకారం ఏడాదిలో ఒక్కసారి కూడా లాకర్ ఓపెన్ చేయకపోతే ఆ లాకర్ తెరవడానికి బ్యాంకులకు అనుమతి ఉంటుంది. అయితే అంతకన్నా ముందే లాకర్ ఆపరేట్ చేయాలని లేదా సరెండర్ చేయాలని కోరుతూ బ్యాంకులు ఖాతాదారులకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Rs 2000 Notes: ఏటీఎంలో రూ.2000 నోట్లు బంద్... ఎందుకో తెలుసా?
EPF-Aadhaar Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా
Gold Discount: బంగారంపై రూ.6,000 డిస్కౌంట్... కొనండి ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank account, Banking, Sbi, State bank of india