స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఊహించని నిర్ణయం తీసుకుంది. హోమ్ లోన్ వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్స్ పెంచింది. 100 బేసిస్ పాయింట్స్ 1 శాతంతో సమానం. ఎస్బీఐ పెంచిన వడ్డీ రేటు కొత్తగా హోమ్ లోన్ తీసుకునే కస్టమర్లకు వర్తిస్తుంది. గురువారం ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్-MCLR 15 బేసిస్ పాయింట్స్ తగ్గించిన సంగతి తెలిసిందే. మే 10 నుంచి ఇది అమలులోకి వస్తుంది. మరోవైపు గత నెలలో రెపో లింక్డ్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్‌ను 75 బేసిస్ పాయింట్స్ తగ్గించింది ఎస్బీఐ. ఇప్పుడు వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్స్ పెంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లు మే 1 నుంచి అమలులోకి వస్తాయి. మే 1 కన్నా ముందు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్-EBR కన్నా 15 నుంచి 50 బేసిస్ పాయింట్స్ అదనంగా వడ్డీ రేట్లు ఉంటే, మే 1 తర్వాత 35 నుంచి 70 బేసిస్ పాయింట్స్ అదనంగా వడ్డీ రేట్లు ఉంటాయి.
ఉదాహరణకు ఎస్బీఐలో మే 1 తర్వాత రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకునేవారు కనీసం 7.40 శాతం వడ్డీ రేటు చెల్లించాలి. గతంలో ఈ వడ్డీ రేటు 7.20 శాతంగా ఉండేది. మహిళలు ఇప్పుడు 7.35 శాతం వడ్డీ చెల్లించాలి. గతంలో 7.15 శాతం చెల్లించాలి. రెపో లింక్డ్ ఈబీఆర్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం 7.05 శాతం ఉంది. ఇటీవల కాలంలో రెపో రేట్ భారీగా తగ్గుతుండటంతో ఆదాయంపై దృష్టిపెట్టి బ్యాంకు వడ్డీ రేటు పెంచినట్టు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికే బ్యాంకులో హోమ్ లోన్ ఉన్నవారికి ఎలాంటి నష్టం లేదు. కానీ కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారు 20 బేసిస్ పాయింట్స్ అదనంగా వడ్డీ చెల్లించాలి.
ఇవి కూడా చదవండి:
SBI Loan: 45 నిమిషాల్లో రూ.5,00,000 వరకు లోన్... అప్లై చేయండిలా
Lockdown: క్రెడిట్ కార్డ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు
SBI Mobile Banking: ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్... ఈ స్టెప్స్‌తో చాలా ఈజీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Home loan, Housing Loans, Personal Finance, Sbi, State bank of india