SBI: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉందా? ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన బ్యాంకు

SBI: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉందా? ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన బ్యాంకు (ప్రతీకాత్మక చిత్రం)

SBI Zero Balance Account | జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్ల నుంచి వసూలు చేస్తున్న ఛార్జీలపై ఎస్‌బీఐ క్లారిటీ ఇచ్చింది.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై ఐఐటీ-బాంబే నిర్వహించిన ఓ అధ్యయనం సంచలనంగా మారింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్-BSBDA అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ల నుంచి 2015-2020 మధ్య రూ.300 కోట్లు సర్వీస్ ఛార్జీల రూపంలో బ్యాంకు వసూలు చేసిందన్నది ఆ అధ్యయనం సారాంశం. ఎస్‌బీఐ మాత్రమే కాదు ఇతర బ్యాంకులు కూడా ఇలా సేవల పేరుతో అత్యధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఐఐటీ-బాంబే బాంబు పేల్చింది. దీనిపై ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్లకు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు వసూలు చేస్తున్నామని, 2016 జూన్ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చాయని, ఈ ఛార్జీలపై కస్టమర్లకు ముందుగానే సమాచారం ఇస్తున్నామని ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది. అయితే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్-BSBDA అకౌంట్లకు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని బ్యాంకులకు 2012 ఆగస్టులో అనుమతి ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. అయితే అదనపు సేవలు పొందే స్వేచ్ఛ కస్టమర్లకు ఉంటుంది. అదనపు సేవలు పొందినప్పుడు ఛార్జీలు చెల్లించాల్సిందే.

    RTGS Services: అలర్ట్... 14 గంటలపాటు ఆ‌ర్‌టీజీఎస్ సేవలు బంద్... ఎప్పుడో తెలుసుకోండి

    PAN Card: పాన్ కార్డ్‌లోని 10 డిజిట్స్‌కి అర్థం ఏంటో తెలుసా?

    2021 జనవరి 1 తర్వాత డిజిటల్ పద్ధతిలో నిర్వహించిన లావాదేవీలకు ఏవైనా చార్జీలు వసూలు చేసినట్టైతే వాటిని రీఫండ్ చేయాలంటూ 2020 ఆగస్టులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT ఆదేశించింది. అంతేకాదు... ఇకపై అలాంటి ఛార్జీలేవీ వసూలు చేయకూడదని కూడా కోరింది. ఈ ఆదేశాలతో ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్న కస్టమర్లకు డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను 2020 సెప్టెంబర్ 14న రీఫండ్ చేసింది. ఆ తర్వాతి రోజు నుంచి డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదు. ఒక నెలలో నాలుగు కన్నా ఎక్కువ క్యాష్ విత్‌డ్రాయల్స్ చేస్తే ఎస్‌బీఐ ఛార్జీలు వసూలు చేస్తోంది. జీరో బ్యాలెన్స్ అకౌంట్, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ హోల్డర్లు డిజిటల్ పేమెంట్ పద్ధతుల్ని పాటించేలా ప్రోత్సహించేందుకు ఈ ఛార్జీలను అమలు చేస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. అన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై ఎస్ఎంఎస్ సర్వీసులు, మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటనెన్స్ ఛార్జీలను కూడా తొలగించామని ఎస్‌బీఐ ప్రకటించింది.

    Money Transfer: పొరపాటున డబ్బులు వేరే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇలా చేయండి

    LIC Bima Jyoti: చెల్లించే ప్రీమియంకు డబుల్ బెనిఫిట్ అందించే ఎల్ఐసీ పాలసీ

    చిరుద్యోగులు, తక్కువ ఆదాయం ఉన్నవారి కోసం ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. దీన్నే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని కూడా పిలుస్తారు. ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కేవైసీ తప్పనిసరి. ఇందులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతీ నెలా 4 క్యాష్ విత్‌డ్రాయల్స్ ఉచితం. ఆ తర్వాత ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాలి.
    Published by:Santhosh Kumar S
    First published: