SBI: సర్వీస్ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన ఎస్‌బీఐ... లేటెస్ట్ రేట్స్ ఇవే

SBI Free Transactions | అక్టోబర్ 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు అమలులోకి వచ్చిన మాట వాస్తవమేనని, అయితే అది కొన్ని అంశాల్లో మాత్రమేనని ఎస్‌బీఐ వెల్లడించింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా తమ సర్వీస్ ఛార్జీలు మారలేదని తేల్చి చెప్పింది.

news18-telugu
Updated: October 1, 2019, 3:21 PM IST
SBI: సర్వీస్ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన ఎస్‌బీఐ... లేటెస్ట్ రేట్స్ ఇవే
SBI: సర్వీస్ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన ఎస్‌బీఐ... లేటెస్ట్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 1, 2019, 3:21 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI సర్వీస్ ఛార్జీలు మార్చడంపై సోషల్ మీడియా రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఏడాదికి 40 క్యాష్ డిపాజిట్స్, విత్‌డ్రాయల్స్ ఉచితం అని, నెలకు 4 ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఫ్రీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. సర్వీస్ ఛార్జీలపై ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చింది. క్యాష్ డిపాజిట్స్, విత్‌డ్రాయల్స్, ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని స్పష్టం చేసింది ఎస్‌బీఐ. అక్టోబర్ 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు అమలులోకి వచ్చిన మాట వాస్తవమేనని, అయితే అది కొన్ని అంశాల్లో మాత్రమేనని ఎస్‌బీఐ వెల్లడించింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా తమ సర్వీస్ ఛార్జీలు మారలేదని తేల్చి చెప్పింది. ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌ గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్‌లో వెల్లడించిన వివరాలు ఇవే.





క్యాష్ డిపాజిట్: నెలకు 3, ఏడాదికి 36 ట్రాన్సాక్షన్స్ ఉచితం
క్యాష్ విత్‌డ్రాయల్: నెలకు 2, ఏడాదికి 24 ట్రాన్సాక్షన్స్ ఉచితం
Loading...
ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎంలో ట్రాన్సాక్షన్స్: నెలకు 5, ఏడాదికి 60 ట్రాన్సాక్షన్స్ ఉచితం
ఇతర బ్యాంక్ ఏటీఎంలో ట్రాన్సాక్షన్స్: నెలకు మెట్రోలో 3, ఇతర ప్రాంతాల్లో 5, ఏడాదికి మెట్రోలో 36, ఇతర ప్రాంతాల్లో 60 ట్రాన్సాక్షన్స్ ఉచితం.
మొత్తం ట్రాన్సాక్షన్స్: నెలకు మెట్రోలో 13, ఇతర ప్రాంతాల్లో 15, ఏడాదికి మెట్రోలో 156, ఇతర ప్రాంతాల్లో 180 ట్రాన్సాక్షన్స్ ఉచితం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్, సర్వీస్ ఛార్జీలపై ఏవైనా అనుమానాలుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Bank Timings: కస్టమర్లకు అలర్ట్... బ్యాంక్ టైమింగ్స్ మారాయి

Best TVs: ఆన్‌లైన్‌లో టీవీ కొంటున్నారా? ఫెస్టివల్ సేల్‌లో 12 బెస్ట్ టీవీలు ఇవే...

New Rules: అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే...
First published: October 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...