హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Good News: ఈఎంఐ చెల్లించారా? వెనక్కి తీసుకోండి ఇలా

SBI Good News: ఈఎంఐ చెల్లించారా? వెనక్కి తీసుకోండి ఇలా

SBI Good News: ఈఎంఐ చెల్లించారా? వెనక్కి తీసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Good News: ఈఎంఐ చెల్లించారా? వెనక్కి తీసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI options on EMI moratorium | ఈఎంఐలపై ఆర్‌బీఐ మారటోరియం విధించడానికన్నా ముందే మీరు ఈఎంఐలు చెల్లించారా? అయినా వెనక్కి తీసుకోవచ్చు అంటోంది ఎస్‌బీఐ. ఎలాగో తెలుసుకోండి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కోవిడ్ 19 రెగ్యులేటరీ ప్యాకేజీలో భాగంగా ఈఎంఐలపై మూడు నెలలు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. దీనికి అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఆమోదముద్ర వేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కూడా మారటోరియం అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. 2020 మార్చి 1 నుంచి 2020 మే 31 వరకు అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలు, వడ్డీని వాయిదా వేసేందుకు చర్యలు తీసుకుంది. రీపేమెంట్ పీరియడ్‌ను మూడు నెలలు పొడిగించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఎస్‌బీఐలో టర్మ్ లోన్స్ అంటే హోమ్, పర్సనల్, ఎడ్యుకేషన్, ఆటో లాంటి రుణాలు తీసుకున్నవారు మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లించకపోయినా పర్వాలేదు. అంతేకాదు... ఒకవేళ మార్చి 1 నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఈఎంఐలు చెల్లించినట్టైతే బ్యాంకుకు దరఖాస్తు చేసి వెనక్కి తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌ను ఎస్‌బీఐ వివరించింది.

ఈఎంఐ చెల్లింపుల విషయంలో కస్టమర్లకు మూడు ఆప్షన్స్ ఉంటాయి.

1. ఈఎంఐ మారటోరియం వాడుకోవద్దనుకునే కస్టమర్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పట్లాగే వారి అకౌంట్ నుంచి ఈఎంఐ డిడక్ట్ అవుతుంది. లేదా కస్టమర్లు ఈఎంఐ చెల్లిస్తే చాలు.

2. ఈఎంఐ మారటోరియం కోరుకునేవారు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈఎంఐలు నేషనల్ ఆటోమెటెడ్ క్లియరింగ్ హౌజ్-NACH ద్వారా ఆటో డెబిట్ అవుతుంటాయి. అందుకే (Annexure-II) దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి (Annexure-III) లో ఉన్న ఇమెయిల్ ఐడీకి పంపాలి.

3. ఇప్పటికే అంటే మార్చి 1 నుంచి ఇప్పటి వరకు ఈఎంఐ చెల్లించినట్టైతే వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం (Annexure-I) అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి (Annexure-III) లోని ఇమెయిల్ ఐడీకి పంపాలి. ఈ దరఖాస్తు ఫామ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈఎఐ రీఫండ్ 7 వర్కింగ్ డేస్‌లో అకౌంట్‌లోకి వస్తుంది. మారటోరియం ఎంచుకున్నవారు మూడు నెలలు వాయిదా వేసుకోవచ్చు. ఈఎంఐ చెల్లించనందుకు క్రెడిట్ స్కోర్‌కు ఇబ్బందేమీ ఉండదు. కానీ ఔట్‌స్టాండింగ్ ఎంత ఉందో దానికి వడ్డీ మాత్రం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆటో లోన్ రూ.6 లక్షలు తీసుకుంటే ఇంకో 54 నెలలు చెల్లించాల్సి ఉందనుకుందాం. అదనంగా వడ్డీ రూ.19,000 చెల్లించాలి. హోమ్ లోన్ రూ.30 లక్షలు తీసుకుంటే మరో 15 ఏళ్లు చెల్లించాల్సి ఉందనుకుందాం. అదనంగా వడ్డీ రూ.2.34 లక్షల వరకు అవుతుందని ఎస్‌బీఐ లెక్కేసి మరీ చెప్పింది. కాబట్టి డబ్బులు ఉన్నవారు మారటోరియం ఎంచుకోకుండా ఈఎంఐలు ఎప్పట్లాగే చెల్లించడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే

EPF Claim: ఈపీఎఫ్ విత్‌డ్రాలో సమస్యలున్నాయా? ఇలా చేయండి

SBI: ఏటీఎం కార్డులు ఉన్నవారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్

First published:

Tags: Bank, Bank account, Bank loans, Banking, Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, Home loan, Housing Loans, Lockdown, Personal Finance, Personal Loan, Rbi, Reserve Bank of India, Sbi, State bank of india

ఉత్తమ కథలు