• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • STATE BANK OF INDIA SBI EMERGENCY LOAN SCHEME GET UP TO RS 5 LAKH LOAN JUST IN 45 MINUTES KNOW HOW SS

SBI Loan: 45 నిమిషాల్లో రూ.5,00,000 వరకు లోన్... అప్లై చేయండిలా

SBI Loan: 45 నిమిషాల్లో రూ.5,00,000 వరకు లోన్... అప్లై చేయండిలా

SBI Loan: 45 నిమిషాల్లో రూ.5,00,000 వరకు లోన్... అప్లై చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Emergency Loan Scheme | కరోనా వైరస్ సంక్షోభంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కేవలం 45 నిమిషాల్లో రూ.5,00,000 వరకు లోన్ ఇస్తోంది. వడ్డీ కూడా తక్కువ.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు గుడ్ న్యూస్. కరోనా వైరస్ కష్టకాలంలో కస్టమర్లను ఆదుకోవడానికి భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ రంగంలోకి దిగింది. 'ఎస్‌బీఐ ఎమర్జెన్సీ లోన్ స్కీమ్' ప్రారంభించింది. కస్టమర్లు కేవలం 45 నిమిషాల్లో రూ.5,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. వడ్డీ కూడా తక్కువే. కేవలం 10.5 శాతం వడ్డీ రేటుతో ఈ పర్సనల్ లోన్ అందిస్తోంది ఎస్‌బీఐ. ప్రస్తుతం ఇతర బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై తీసుకుంటున్న వడ్డీతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంతేకాదు... లోన్ తీసుకోగానే ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత మీ ఈఎంఐ మొదలవుతుంది.

    కరోనా వైరస్ సంక్షోభం అనేక రంగాలను కుదిపేస్తోంది. ఉద్యోగాలకు ముప్పు తీసుకొచ్చింది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేలా చేసింది. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు డబ్బు కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కష్టకాలంలో ఆదుకోవడం కోసం 'ఎస్‌బీఐ ఎమర్జెన్సీ లోన్ స్కీమ్' ప్రారంభించడం విశేషం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పు దొరకడం చాలా కష్టం. కానీ మంచి క్రెడిట్ రికార్డ్ ఉంటే సులువుగా అప్పు తీసుకోవచ్చు. 'ఎస్‌బీఐ ఎమర్జెన్సీ లోన్ స్కీమ్' ద్వారా అయితే కేవలం 45 నిమిషాల్లో రూ.5,00,000 లోన్ తీసుకోవచ్చు. ప్రాసెస్ పూర్తి కాగానే అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి.


    యోనో యాప్ ద్వారా 'ఎస్‌బీఐ ఎమర్జెన్సీ లోన్ స్కీమ్'లో మీరు లోన్ తీసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీరు మీ ఎలిజిబిలిటీ తెలుసుకోవాలి. అంటే 'ఎస్‌బీఐ ఎమర్జెన్సీ లోన్ స్కీమ్'కు మీరు అర్హులో కాదో తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 567676 నెంబర్‌కు సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి. PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ అకౌంట్ నెంబర్‌లోని చివరి 4 అంకెలు టైప్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. ఉదాహరణకు మీ అకౌంట్ చివర్లో 1234 అని ఉంటే PAPL 1234 అని టైప్ చేసి ఎస్ఎంఎస్ చేయాలి.

    మీరు ప్రీ-అప్రూవ్డ్ లోన్‌కు అర్హులు అయితే యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని లాగిన్ కావాలి. యాప్‌లో 'Pre-approved Loan' ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీకు ఎంత రుణం కావాలి? ఎంత కాల వ్యవధిలో చెల్లిస్తారు? అన్న వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ ఎస్‌బీఐ అకౌంట్‌లోకి ఎమర్జెన్సీ లోన్ వచ్చేస్తుంది.

    ఇవి కూడా చదవండి:

    Loan: రూపాయి వడ్డీకే లోన్ తీసుకోవచ్చు... ఆ స్కీమ్‌లో ఉన్నవారికే అవకాశం

    Jan Dhan account: నేటి నుంచి జన్ ధన్ అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్... చెక్ చేయండిలా

    EMI moratorium: ఈ తప్పు చేస్తే మీ అకౌంట్ ఖాళీ... ఏం చేయాలంటే
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు