SBI Loan: కస్టమర్లకు గుడ్ న్యూస్... ఎస్‌బీఐలో తగ్గనున్న మీ ఈఎంఐ

SBI Home Loan | ఒకవేళ మీ హోమ్ లోన్ ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్ రేట్‌కు లింకై ఉంటే మీ ఈఎంఐలు కూడా తగ్గనున్నాయి. సాధారణంగా ఎంసీఎల్ఆర్ బేస్డ్ లోన్లపై ప్రతీ ఏడాది వడ్డీ రేట్లు రీసెట్ అవుతుంటాయి.

news18-telugu
Updated: December 9, 2019, 2:49 PM IST
SBI Loan: కస్టమర్లకు గుడ్ న్యూస్... ఎస్‌బీఐలో తగ్గనున్న మీ ఈఎంఐ
SBI Loan: కస్టమర్లకు గుడ్ న్యూస్... ఎస్‌బీఐలో తగ్గనున్న మీ ఈఎంఐ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారికి శుభవార్త. కార్ లోన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI హోమ్ లోన్ వడ్డీ రేట్లను మరింత తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్-MCLR 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది ఎస్‌బీఐ. ఈ కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 10 నుంచి అమలులోకి వస్తాయి. ఎస్‌బీఐ ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 8.00% నుంచి 7.90% కావడంతో ఎంసీఎల్ఆర్‌తో లింక్ ఉన్న హోమ్, కార్, రీటైల్ లోన్ల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఎంసీఎల్ఆర్‌ను ఎస్‌బీఐ తగ్గించడం వరుసగా ఇది ఎనిమిదో సారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించిన ప్రతీసారి ఆ లాభాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తూ ఎస్‌బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తోంది.

భారతదేశంలో అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న సంస్థగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. హోమ్ లోన్, ఆటో లోన్ కేటగిరీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మార్కెట్ షేర్ 25% ఉండటం విశేషం. ఒకవేళ మీ హోమ్ లోన్ ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్ రేట్‌కు లింకై ఉంటే మీ ఈఎంఐలు కూడా తగ్గనున్నాయి. సాధారణంగా ఎంసీఎల్ఆర్ బేస్డ్ లోన్లపై ప్రతీ ఏడాది వడ్డీ రేట్లు రీసెట్ అవుతుంటాయి. ఇక కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలని అనుకునేవారికి రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ స్కీమ్ కూడా ఆఫర్ చేస్తోంది ఎస్‌బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించిన ప్రతీసారి ఈ హోమ్ లోన్ వడ్డీ రేటు కూడా తగ్గుతుంది.

కొద్దిరోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI సమావేశంలో రెపో రేట్‌ను 5.15% యథాతథంగా ఉంచడం విశేషం. అయితే గత ఏడాదిగా చూస్తే మొత్తంగా 135 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ తగ్గించింది ఆర్‌బీఐ.

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ చేయడానికి డిసెంబర్ 31 లాస్ట్ డేట్Free WiFi: దేశవ్యాప్తంగా 5,500 రైల్వేస్టేషన్లలో ఫ్రీ వైఫై... మీరూ వాడుకోవచ్చు ఇలా

SBI offers: మరోసారి ఎస్‌బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్... 50% వరకు డిస్కౌంట్స్ పొందండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: December 9, 2019, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading