మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా? లేదా ఎఫ్డీలో డబ్బులు దాచుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది ఎస్బీఐ. 45 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నింటిపైనా వడ్డీ రేట్లు తగ్గాయి. 45 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్‌పై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటును 5.75% నుంచి 5. 00% చేయగా, 46 రోజుల నుంచి 179 రోజుల డిపాజిట్లపై వడ్డీని 6.25% నుంచి 5.75% చేసింది. 180 రోజుల నుంచి 210 రోజుల డిపాజిట్లపైనా 10 బేసిస్ పాయింట్లు తగ్గించి ప్రస్తుతం 6.25% వడ్డీని ఆఫర్ చేయబోతోంది. ఒకటి రెండేళ్ల డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఎస్బీఐ. కొత్త వడ్డీ రేట్లన్నీ 2019 ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఏఏ డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లు, ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వచ్చే వడ్డీ రేట్ల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.
2019 మే 9న వడ్డీ రేట్లను సవరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... మూడు నెలల్లోనే వడ్డీ రేట్లను తగ్గించి డిపాజిటర్లకు షాకిచ్చింది. ఒక్క ఎస్బీఐ మాత్రమే కాదు... యాక్సిస్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు మరిన్ని బ్యాంకులూ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానాన్ని నిర్ణయించడానికి కొన్ని రోజుల ముందే ఎస్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం విశేషం. ఇక ఆర్బీఐ ఈ ఏడాది రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం కూడా పీపీఎఫ్తో పాటు ఇతర చిన్నమొత్తాల పొదుపు పథకాల జూలై-సెప్టెంబర్ త్రైమాసికానిసి వడ్డీ రేట్లను తగ్గించింది.
Redmi K20 Pro: రెడ్మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి...
ఇవి కూడా చదవండి:
Smart Consumer: మీరు నకిలీ వస్తువులు కొంటున్నారా? ఈ యాప్‌తో తెలుసుకోండి
LIC Plan: రోజుకు రూ.29... రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్... ఇంకెన్నో లాభాలు
Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ తప్పులతో తిప్పలేPublished by:Santhosh Kumar S
First published:July 31, 2019, 10:05 IST