SBI: పండుగ పూట షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ... కస్టమర్లకు నష్టమే

State Bank of India | గతంలో ఎస్‌బీఐ ఏడాది నుంచి రెండేళ్ల లోపు వడ్డీ రేట్లపై 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

news18-telugu
Updated: January 14, 2020, 2:55 PM IST
SBI: పండుగ పూట షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ... కస్టమర్లకు నష్టమే
SBI: పండుగ పూట షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ... కస్టమర్లకు నష్టమే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
జనమంతా సంక్రాంతి పండుగ సందడిలో ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు 2020 జనవరి 10 నుంచే అమలులోకి వస్తున్నట్టు ప్రకటించింది. ఏడాది నుంచి 10 ఏళ్ల లోపు లాంగ్ టర్మ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్లు వడ్డీ తగ్గింది. ఏడు రోజుల నుంచి 1 ఏడాది వడ్డీ రేట్లల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో ఎస్‌బీఐ ఏడాది నుంచి రెండేళ్ల లోపు వడ్డీ రేట్లపై 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

7 రోజుల నుంచి 45 రోజులు- 4.50%
46 రోజుల నుంచి 179 రోజులు- 5.50%

180 రోజుల నుంచి 210 రోజులు- 5.80%
211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 5.80%


1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 6.10%
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 6.10%3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 6.10%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 6.10%

పిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ అదనంగా వడ్డీ ఇస్తుంది ఎస్‌బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేట్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌తో అదిరిపోయేలా ఫోటోషూట్...రియల్‌మీ ఎక్స్2 ప్రో అద్భుతం



ఇవి కూడా చదవండి:

Gold: మార్కెట్ రేట్ కన్నా రూ.1,800 తక్కువ ధరకే బంగారం... కొనండి ఇలా

Araku Tour: అరకు టూర్ తక్కువ ధరకే... ఐఆర్‌సీటీసీ నుంచి స్పెషల్ ప్యాకేజీ

PPF New Rules: మారిన పీపీఎఫ్ రూల్స్‌తో లాభమా... నష్టమా? తెలుసుకోండి
First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>